Sunday, May 3, 2020

వేమన పద్యాలు – సంస్కృతానువాదము 4. అర్థపద్ధతిః


వేమన పద్యాలు సంస్కృతానువాదము


4. అర్థపద్ధతిః

అధముఁ డైన మనుజుఁ డర్థవంతుండైన
నతనిమాట నడచు నవనిలోన
గజపతింట నున్న[1] గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.1
నీచోఽపి ధనసమ్పన్నో భువి సర్వైర్మహీయతే
భూపం వరాటికా ప్రాప్తా శ్లాఘ్యతే ఘనవత్ జనైః
అధికభుక్తిచేత మొదటసొమ్ముకు హాని
కుదువసొమ్ముకన్నఁ గొంతహాని
మొదటిపక్షమునను మూలకర్తకు హాని
విశ్వదాభిరామ వినురవేమ.                          4.2
అతివ్యయాత్ మూలధనం నశ్యేత్ న్యాసేఽల్పమేవ
అతిభుక్త్యా దేహనాశస్తస్మాత్కార్యో మితవ్యయః
అప్పులేనివాఁడె యధికసంపన్నుండు
తప్పులేనివారు ధరను లేరు
గొప్పలేనిబుద్ధి కొంచెమైపోవురా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.3
అనృణో ధనికో గణ్యః ; ఋణాద్దోషో భవేదితి
జ్ఞాత్వాపి క్రియతే సర్వైః తేన నిన్ద్యా భవన్తి తే
అరయఁ దఱచు కల్లలాడెడు వారింట
వెడల కేల లక్ష్మి విశ్రమించు
నీర మోటికుండ నిలువనిచందాన
విశ్వదాభిరామ వినురవేమ.                          4.4
అసత్యం సర్వదా యస్తు కథయేత్ తస్య మన్దిరే
న తిష్ఠతి ధ్రువం లక్ష్మీః జలం భిన్నఘటే యథా
అర్థవంతుసొమ్ము నాసింతు రర్థులై
యర్థి కీయ సొమ్ము వ్యర్థమగును
వ్యర్థమైనసొమ్ము వ్యర్థులఁ జేరురా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.5
అలసాయ న దాతవ్యం విత్తమ్ , నో చేద్వినా శ్రమమ్
లబ్ధమేతదితి జ్ఞాత్వా దుర్వ్యయేన స నాశయేత్
ఆఁడువారిగన్న నర్థంబు బొడగన్న
సారమైనరుచుల చవులఁ గన్న
అయ్యగారికైన నాశలు గలుగవా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.6
రమణీం చ తథా విత్తం మధురం భక్ష్యమేవ చ |
దృష్ట్వా లబ్ధం భవేదాశా మహతామపి దేహినామ్
ఆపదందుఁ జూడు మారయ బంధుల
భయము వేళఁ జూడు బంటుగుణము
పేదవడ్డవెనుకఁ బెండ్లముమతిఁ జూడు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.7
ఆపత్సాహ్యకరో బన్ధుః కిఙ్కరో భయసాహ్యదః
దారిద్ర్యేపి చ యా సాహ్యం కుర్యాద్భార్యేతి సా మతా 
ఆశచేత ధనము నార్జింపఁగా నేల
మట్టిక్రిందఁ బెట్టి మఱువనేల
ధనము పోవువెనుక ధర్మం బదేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.8
అదత్వా స్వార్జితం విత్తమభుక్త్వా ఖననాద్ధనమ్
విస్మరన్తి జనాః, నష్టే విత్తే ధర్మః కథం భవేత్
ఇంటిలోనిధనము నిది నాది యనుచు
మంటిలోన దాఁచు మంకుజీవి
కొంచుబోఁడు వెంట గుల్లకాసును రాదు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.9
మమేదం విత్తమిత్యుక్త్వా తన్నిక్షిప్య క్షితేరధః
రక్షేన్మూఢో మృత్యుకాలే కిం విత్తం సహ నేష్యతి ?
ఇరుగుపొరుగువారి కెనయుసంపదఁ జూచి
తమకు లేదటన్న ధర్మమేమి
ధర్మమన్నఁ దొల్లి తన్నుక చచ్చిరి
విశ్వదాభిరామ వినురవేమ.                          4.10
దృష్ట్వా పరధనం లోకే చిన్తయా కిం ప్రయోజనమ్
పూర్వపుణ్యాద్భవేద్విత్తం తదభావే వృథా శ్రమః
ఇహమునందు చాల నిడుములు పడినను
బడుగు పొందగలఁడె పరమపదవి
పేద కనువుపడునె పృథివిపై భాగ్యంబు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.11
పూర్వపుణ్యం వినా యత్నాన్నరో ముక్తిం న విన్దతి
పూర్వపుణ్యం వినా భాగ్యం దరిద్రో నాప్నుయాద్ భువి
ఇహమున సుఖియింప హేమతారకవిద్య
పరమున సుఖియింప బ్రహ్మవిద్య
కడమవిద్య లెల్ల గల్ల మూఢులకెరా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.12
ఇహ సౌఖ్యం స్వర్ణవిద్యా, బ్రహ్మవిద్యా పరే సుఖమ్
దదాత్యన్యాస్తు విద్యాః స్యురఫలాః మూఢసేవితాః
ఇహమునందు సుఖము లింపార లేదట
పరమువందు సుఖముఁ బడయు టెట్లు
ధనము లేక సుఖము తన కెట్లు కలుగురా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.13
ధనేనాత్ర భవేత్ సౌఖ్యం దానపుణ్యాదముత్ర చ
ముక్తిః స్యాత్ , నిర్ధనః సౌఖ్యం నాప్నుయాల్లోకయోర్ద్వయోః
ఈఁతకన్న లోఁతు నెంచంగఁ బనిలేదు
చావు కన్న గీడు జగతి లేదు
గోచిఁపాఁతకంటె గొంచెం బిఁకను లేదు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.14
జలే ప్లవనదక్షస్య నాగాధత్వభయం భవేత్
న దుఃఖం మృత్యుకామస్మ న దారిద్ర్యభయం మునేః
ఉచితవంతుఁ డైన నుద్యోగపరుఁడైన
సంప దమరియున్న సమయముననె
పరుల కుపకరించి పాలింపఁ గల్గును
విశ్వదాభిరామ వినురవేమ.                          4.15
సాత్త్వికో వా మహాస్థానగతో వా నిర్ధనో నరః
పరోపకారం కిం కుర్యాత్ రాజ్యం వా పాలయేత్ కథమ్
ఉన్నయంత మనుజుఁ డుపకారి గాలేక
కన్ను కానఁడంచు ఘనుఁడు వల్కు
దీనుఁ డై నతనకు దిక్కెవ్వరగుదురు?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.16
మదాన్ధోఽయం పరేషాం దదాతీతి మానవాః
నిన్దన్తి ధనికం తస్య దారిద్ర్యే కస్తు రక్షకః
ఉప్పులేని కూర యొప్పదొ రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదొ
అప్పులేనివాఁడె యధికసంపన్నుఁడు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.17
అన్నం చ సూపరహితం శాకం లవణవర్జితమ్
భోక్తవ్యమ్ , న ఋణం కార్యమనృణో ధనవాన్ భవేత్
ఉర్వివారికెల్ల నొక్కకంచముఁ బెట్టి
పొత్తుఁ గుడిపి కులము పొలయఁ జేసి
తలను చేయిపెట్టి తగ నమ్మఁజెప్పరో[2]!
విశ్వదాభిరామ వినురవేమ.                          4.18
జాతిసామ్యాదైకమత్యాదేకపాత్రాశనాత్ సుఖమ్
అస్తీతి శీర్షే నిక్షిప్య హస్తం శపథమాచర
ఋణ మొసఁగు నాతఁ డినుఁడగుఁ దొలుదొల్త
నదియు మరల నడుగ యముఁడుగ నగు
అప్పుఁజేసి తీర్ప నఱయనివారికి
విశ్వదాభిరామ వినురవేమ.                          4.19
ఋణదాతా రవిః సాక్షాత్ ; తేన ప్రత్యర్ప్యతామితి
పృష్టో దాతుమశక్తః సన్ తం పశ్యేద్యమదేవతామ్
ఎంతభూమి దిరిగి యేపాటు పడుచున్న
నంటనీక ప్రాప్తి వెంటఁ దిరుగు
భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.20
బహుదేశానటిత్వాపి నిర్భాగ్యో నాప్నుయాత్ ధనమ్
దేశా నూత్నాః, నరో భోక్తా సర్వత్ర సమ ఏవ సః
ఎద్దుమొద్దువాని కేలశాస్త్రంబులు
ముద్దునాతి కేల ముసలిమగఁడు
చద్దిమిగులనిల్లు సంసార మేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.21
వృథా శాస్త్రం పశుప్రాయే, వృద్ధభర్తా వృథా స్త్రియాః
పురాతనం గృహే నో చేత్ జీవనం తత్ వృథా భవేత్
ఎన్నాళ్ళిలఁ దా నుండును
ఎన్నాళ్ళిలఁ దాను నేర్చు నెన్నిఁట వెలయ౯[3]
గొన్నాళ్ళకుఁ దాఁ జనినను
మన్నౌఁగద విద్యలెల్ల[4] మహిలో వేమా!             4.22
స్వల్పమాయుః ధ్రువో మృత్యుః కియత్తత్ర పఠేన్నరః
అధీతం చ మృతం తస్మిన్ నశ్యేత్ ముక్తౌ మనః కురుః
ఓజమాలునగును ఓడిమాడలచేటు[5]
పాటులేని మగఁడు కూటిచేటు
పనికిమాలు దాసి బత్తెంబు చేటురా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.23
వ్యర్థో వ్యయో మూఢభార్యావివాహాత్ ; అలసాయ తు
దత్తమన్నం వృథా ; మూఢదాస్యై వ్యర్థం తు వేతనమ్
కట్టెపేరు లోలిగట్టి[6] చెప్పఁగ రాదు
కానరాక యున్నె కలిమితనము
జంగమైనవాని జాతి గన్పడదొకో
విశ్వదాభిరామ వినురవేమ.                          4.24
వేషేణ ధనవాన్ న స్యాదస్తి చేత్ జ్ఞాయతే స్వయమ్
జఙ్గమాఖ్యా శైవజాతిః దర్శనాత్ జ్ఞాయతే కిల
కడుపునిండఁ దవుడు గంపలోఁ బెట్టిన
జన్నుఁ బట్టనీక తన్ను గేదె
వారకాంత లెట్లు వలతురో యూఱక?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.25
పూర్ణాహారప్రదం చాపి మహిషీ స్తనమర్దనే
పద్భ్యాం చేత్తాడయేత్ , కిన్ను వక్తవ్యం కులటాం ప్రతి
కనకపర్వతమునఁ గాపురం బుండిన
ననిమిషేశ్వరునకు నాసపోదు
కనకకుండలములు కర్ణుని నడుగఁడా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.26
ఇన్ద్రః స్వర్ణాచలస్థోపి యయాచే స్వర్ణకుణ్డలే
కర్ణం ధనేచ్ఛయా ; లోకే విత్తాశా దుస్త్యజా నృణామ్
కనకమృగము భువిని కద్దు లే దనలేక
తరుణి విడిచిపోడె దాశరథియు
దైవమైన ధనము దలఁచుచుండెను గాదె
విశ్వదాభిరామ వినురవేమ.                          4.27
లోకే స్వర్ణమృగః స్యాద్వేత్యనాలోచ్యైవ రాఘవః
తమన్వగాత్ వినా సీతామ్ , దేవస్యాపి ధనే స్పృహా
కనక మున్నవాఁడు కాముఁడు భీముఁడు
మిగులఁ దేజమంది మెలఁగుచుండు
విత్తహీనుఁడైన వెఱ్ఱులలోనేటు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.28
ధనికో మదనో భీమస్తేజస్వీత్యుచ్యతే జనైః
దరిద్రం కీర్తియుక్తం చ మూర్ఖేషు ప్రథమం విదుః
ఉన్న ఘనతఁబట్టి మన్నింతురేగాని[7]
పిన్న పెద్దతనము లెన్నఁబోరు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.29
మహత్త్వం గౌరవే హేతుః న వయస్తత్ర కారణమ్
వసుదేవం పరిత్యజ్య వాసుదేవం నమన్తి హి
కనియుఁ గానకుండుఁ గదలింపఁ డానోరు[8]
వినియు వినకయుండు విస్మయంబు
సంపద గలవాని సన్నిపాతక మిది[9]
విశ్వదాభిరామ వినురవేమ.                          4.30
ఆఢ్యో దరిద్రవిషయం పశ్యన్నపి న పశ్యతి
శృణ్వన్ వా న శృణోత్యేషః సన్నిపాతజ్వరో మహాన్
కన్నెమీఁది యాస కనకంబుపై నాస
లేనివాఁడు పుడమి లేనివాఁడు
కలిగెనే నతండు కానంగ రాఁడయా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.31
కనకం కామినీం దృష్ట్వా సర్వేషాం జాయతే స్పృహా
యది స్యాత్ నిస్పృహః కశ్చిదదృష్టః స వసేద్రహః
కమ్మరీని దుడుకు కార్యవినాశంబు
వడ్లవాని దుడుకు వాలపిడుగు
కాసువాని[10] దుడుకు కాకుత్స్థు[11]బాణంబు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.32
కర్మారతక్షకౌ వేగే కార్యం నాశయతః క్షణాత్
తత్ సాధయేత్ రాజదూతః త్వరితో రామబాణవత్
కర్ణుఁడొకఁడెగాని ఘను లెవ్వరును లేరు
దానశీలుఁ డంచు తలఁపఁబడెను
తలఁప ధనము కర్ణు దాతఁ జేసెను సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.                          4.33
కర్ణ ఏకో దానశీలః తత్సమో నాస్తి భూతలే
ఇతి కీర్తిం స్థిరాం కర్ణో ధనమూలామవిన్దత
కలిగినమనుజుండు కాముఁడై సోముఁడై
మిగుల తేజమునను మెఱయుచుండు
విత్తహీనుఁడైన నుత్తసన్న్యాసిరా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.34
ధనవాన్ కామతుల్యః స్యాత్ తేజస్వీ సోమసన్నిభః
ధనహీనమనుష్యస్తు సన్న్యాసిసదృశో భవేత్
కలిగి ధర్మ మీయఁ గాననివారును
కలిగి తినక చాల గ్రాగువారు
కలిమి నెచటఁ జూడఁ గానక చెడుదురు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.35
న దదాతి న భుఙ్క్తే యో విత్తే సత్యపి పుష్కలే
భావిజన్మస్వపి ధనమదృష్ట్వా స వినశ్యతి
కలిమి యున్న వానిఁ గని పట్టి యిచ్చిన
మనువు[12]బొంగుపాలు మఱగినట్లు
లోన నిగిరి కలిమి లొట్టపోయెడునొకో
విశ్వదాభిరామ వినురవేమ.                          4.36
ధనికాయ సుతాదానాత్ బాన్ధవ్యం తప్తదుగ్ధవత్
వర్ధతే సతతమ్ ; శుష్కం భూత్వా భాణ్డే న నశ్యతి
కలిమి కలిగియుండి కఠినభావముఁ జెంది
తెలియ లేరు ప్రజలు తెలివిలేక
కలిమి వెన్నెలగతిఁ గానంగ లేరయా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.37
సమ్పన్నో దయయా హీనః “సమ్పత్ జ్యోత్స్నేవ చఞ్చలా”
ఇతి సత్యం న జానాతి వైచక్షణ్యవివర్జిత
కలిమి కలిగెనేని గాముఁగాఁ జూతురు
లేమి చేతఁ జిక్క లేమ లధిపు
మదనువంటివాని మాలఁగాఁ జూతురు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.38
కురూపం చాపి ధనికం మదనం మన్యతేఽబలా
దరిద్రం కామతుల్యఞ్చ నారీ చణ్డాలమీక్షతే
కలిమి గలుగ సకలకులముల కెక్కువ
కలిమి భోగభాగ్యములకు నెలవు
కలిమి లేనివానికుల మేమి కులమయా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.39
ధనికః శ్రేష్ఠకులవాన్ భోగభాగ్యే భజేత సః
కథం స్యాదుత్తమకులమధనస్య కులం భువి
కలిమిఁ జూచి యీయఁ గాయ మిచ్చినయట్లు
సము నకీయ నదియు సరసతనము
పేద కిచ్చు మనువు పెనవేసినట్లురా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.40
ఆఢ్యాయ కన్యకాదానం స్వాత్మార్పణసమం భవేత్
సమాయ దానముచితమ్ , దరిద్రే దానముత్తమమ్
కలిమినాఁడు మగనిఁ గామించి చూచును
లేమిఁ జిక్కునాఁడు లేవకుండు
మనినమగనినైన మడియంగఁ జూచును
విశ్వదాభిరామ వినురవేమ.                          4.41
విత్తాఢ్యం కామయేద్భార్యా నిర్ధనం నైవ పశ్యతి
జీవితాదస్య మరణం వరమిత్యపి సా వదేత్
కాంచనంబుపైనఁ గాంతలపైనను
బమ్మకైనఁ బుట్టు రిమ్మతెగులు
తోయజాక్షి విడుచు దొరయెవ్వఁరును లేఁరు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.42
కన్యకాం కనకం దృష్ట్వా బ్రహ్మాపి కిల ముహ్యతి
స్త్రియం కమలపత్రాక్షీం కో వా భువి పరిత్యజేత్
కాంచనంబుమీఁది కాంక్ష మోహ మటండ్రు
విడువలేరు దాని విబుధులైన
కాంక్షలేనివారు కానఁగా రారయా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.43
స్వర్ణాశాం ప్రాహురజ్ఞానం ప్రాజ్ఞాః, న త్యజ్యతే చ తైః
కనకం యే న వాఞ్ఛన్తి భువి తే దుర్లభా నరాః
కావవలయు ధనముఁ గాంత నెల్లప్పుడు
కావలేనివాఁడు చావవలయు
కాపులేనిదాని కాపుర మడుగునా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.44
నారీం విత్తం సదా రక్షేత్ నో చేన్మరణముత్తమమ్
అరక్షతః స్త్రియంవిత్తం జీవనం నిష్ఫలం భవేత్
కుడువఁ గూడు లేక కూడఁబెట్టఁగ లేక
విడువ ముడువ లేక గడన లేక
నడువ సాగకున్న నడపీనుఁ గందురు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.45
న భోజయేత్ న భుఙ్క్తే యో భువి విత్తార్జనం వినా
కుటుమ్బం యో న రక్షేత్ తం లోకే జీవచ్ఛవం విదుః
కులము గలుగు వారు గోత్రంబు గలవారు
విద్యచేత విఱ్ఱవీగువారు
పసిఁడి గల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.46
కులీనో గోత్రసమ్పన్నః సర్వవిద్యా విశారదః
ఇమే సర్వే ధనాఢ్యస్య దాసీపుత్రసమా మతాః
కులము లేనివాఁడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న నెన్నఁ గలిమి ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.47
అకులీనోపి భాగ్యేన కులీనః స్యాదభాగ్యవాన్
కులీనోఽప్యకులీనః స్యాత్ భాగ్యం శ్రేష్ఠం కులాదపి
కులుకుగుబ్బఁ జూపి గొబ్బున వలపించి
చేతికాసులెల్లఁ జేరఁదీయ
నతనుచేతికత్తులమరంగఁ గాంతలు[13]
విశ్వదాభిరామ వినురవేమ.                          4.48
దర్శయిత్వా స్తనౌ విత్తం గృహ్ణత్యో మానవాత్ స్త్రియః
కామహస్తకృపాణేన సదృశాః స్యుర్భయావహాః
కూరలేనితిండి కుక్కతిం డనిపించు
మాఱులేనితిండి మాలతిండి
ధారలేనితిండి దయ్యపుతిండిరా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.49
శాకం పత్రం ఘృతం త్యక్త్వా క్రియమాణం తు భోజనమ్
శ్వచణ్డాలపిశాచాది భోజనేన సమం క్రమాత్
కూలినాలిఁ జేసి గుల్లాముపనిచేసి
తెచ్చిపెట్ట నాలు మెచ్చుచుండు
లేమిఁ జిక్కువిభుని వేమాఱు దిట్టును
విశ్వదాభిరామ వినురవేమ.                          4.50
ధనం యో నీచవృత్త్యా వా లబ్ధ్వా పత్న్యై ప్రయచ్ఛతి
తం స్తౌతి పత్నీ, దారిద్ర్యే నిన్దేత్ సా బహుధా పతిమ్
కోమటి మదిఁ గోరు క్షామమే యెల్లెడ
వైద్యుఁ డొరుల కెపుడు వ్యాధిఁ గోరు
ఊరివాఁడు[14] ధనికుఁ జేరఁగాఁ గోరును
విశ్వదాభిరామ వినురవేమ.                          4.51
వైశ్యః క్షామం సదా వాఞ్ఛేత్ వైద్యో రోగం సదా జనే
పౌరా ధనికమన్విష్య వస్తుమిచ్ఛన్తి తేన హి
చదువుందుఁ బాడి సౌఖ్యములందును
పెదవులందు రాజ్యపదవులందు
నాశ లుడిగినట్టి యయ్యలు గలరొకో
విశ్వదాభిరామ వినురవేమ.                          4.52
విద్యాం సౌఖ్యం తథా స్థానం స్త్రీణామధరపల్లవమ్
దృష్ట్వాపి నిఃస్పృహః కశ్చిన్నరః కిం భువి వర్తతే
చమురు గల్గు దివ్వె సంతోషముగ వెల్గు
ధనము గలుగువాని తలఁపుఁ జెలఁగు
ధనము లేనివాని తలఁపులు తీరునా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.53
తైలే సతి యథా దీపో భవేదాఢపస్య వాఞ్ఛితమ్
వర్ధమానం దరిద్రాశా నశ్యేత్ నిఃస్నేహదీపవత్
చావు నేఁడొ రేపొ జతపడివచ్చును
పెక్కునాళ్లు కూడఁ బెట్టనేల
అనుచు నాశ లుడిగినంతటివారేరి?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.54
 అద్య శ్వో వా ధ్రువో మృత్యుః కిం ఫలం ధనరక్షణే”
ఇత్యుక్త్వా నిఃస్పృహః కోఽపి దాతా లోకే దృశ్యతే
జడలుదాల్చు టెల్ల జగము సీ యనుటెల్ల
నొడలు విఱుచునట్టియోగ మెల్ల
ముక్తికాంతఁబట్టి ముద్దాడుకొఱకురా?
విశ్వదాభిరామ వినురవేమ. [15]                      4.55
జటాభారో లోకనిన్దా యోగాద్దేహపరిశ్రమః
తత్ సర్వం ముక్తికాన్తాయాః ప్రాప్త్యర్థం క్రియతే నరైః
టంక మదుకకున్నఁ బొంకంబు గారాదు
స్వర్ణ భూషణంబు జగమెఱుంగు
భటుఁడు వెంట లేక ప్రభుఁడు శోభించునా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.56
సేవకం పురతః కృత్వా ధనికో భువి రాజతే
కనకం చూర్ణసంయుక్తం ధత్తే భూషణతాం యథా
డిందుపడిన వాని నెందును లెక్కింప
రిందు నందుఁ గాన నెట్టులయిన
మందమతివి గాక మహిమతో నుండుము
విశ్వదాభిరామ వినురవేమ.                          4.57
భాగ్యభ్రష్టః పరే లోకే భువి వా న హి గణ్యతే
తస్మాదర్థార్జనపరః కీర్త్యా సహ వసేన్నరః
డొక్క లెండిపోవు డొక్కు తానయ్యును
మమత మానఁగలడె మానవుండు
కాన ధనముఁగూర్పఁగడఁగుము జ్ఞానివై
విశ్వదాభిరామ వినురవేమ.                          4.58
దారిద్ర్యాత్ శుష్కకాయోపి మమతాం న విముఞ్చతి
అతో బుద్ధిమతా విత్తమర్జనీయం సుఖేప్సునా
తమకు బంధు వనుచు తానె తోడుకవచ్చి
కలిమిఁ గలయఁ జూచి కాంక్షపడుచు
దక్షిణల నొసంగి తరుణి నీయఁగఁజూచు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.59
ధనికం బన్ధురిత్యుక్త్వా నరాః కన్యాం సుదక్షిణామ్ |
తస్మై దత్త్వా చ బాన్ధవ్యమిచ్ఛన్తి ధనకాంక్షయా
తఱుచు కల్లలాడు ధరణీశు లిండ్లలో
వేళవేళ లక్ష్మి వెడలిపోవు
నోటికుండలోన నుండునా నీరంబు?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.60
అసత్యభాషిణో రాజ్ఞో మన్దిరాద్యాతి పద్మజా
యథా జలం భిన్నఘటాన్నిర్యాతి క్రమశో భువి
తరుణి సుతులు ధనము ధాన్యముల్ సంపద
లెంతచుట్టుకొనిన నంతచేటు
పసిరికాయ పురుగుపద్ధతి గానరో
విశ్వదాభిరామ వినురవేమ.                          4.61
పత్నీసుతధనైః సమ్యక్ బద్ధో మర్త్యో వినశ్యతి
స్వసృష్టతన్తుబద్ధః సన్నూర్ణనాభో యథా స్వయమ్
తలను బాగపైని దగుపచ్చడము బొజ్జ
చెవులపోగు లరసి చేరు నర్థి
శుద్ధపశువు లనుచు బుద్ధిలో నరయక[16]
విశ్వదాభిరామ వినురవేమ.                          4.62
ఉష్ణీషకుణ్డలక్షౌమమణ్డితో యాచకః ప్రభుమ్
పశుప్రాయం దానశూన్యమజ్ఞాత్వా సేవతే వృథా
తల్లి బిడ్డలకును దగవు పుట్టించెడు
ధనము సుఖముఁ గూర్ప దని వచింత్రు
కాని గడన లేక గడచుట యెట్లురా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.63
జననీసుతయోర్విత్తం విరోధం జనయేదితి
వదన్తి, కిన్తు సంసారః కథం స్యాత్ ధనమన్తరా
తళుకు బెళుకుఁ జూచి ధరలోనిజను లెల్ల
కద్దు లే దటండ్రు ఘనతగాను
ఇదిగొయదిగొ యనుచు నిఁక నెక్కడందురు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.64
సర్వోపి కురుతే సద్యః శ్రుత్వా ధనికవాఞ్ఛితమ్
దరిద్రం తత ఇత్యుక్త్వా బ్రూయాన్నాస్తీతి చాన్తతః
తవిటికరయఁ బోవఁ దండులంబుల గంప
శ్వాన మాశ్రయించు సామ్యముగను
వైశ్యవరునిసొమ్ము వసుధ నీచుల కబ్బు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.65
తుషార్థం గచ్ఛతోఽన్యత్ర తణ్డులః స్యాత్ శ్వభక్షితః
అరక్షితం వైశ్యధనం తథా నీచవశం భవేత్
తాను గుడువ లేఁడు తగవేది యాప్తులఁ
జేరనీయఁ డట్టి చెనటి పశువు
చేనిలోన బొమ్మఁజేసి కట్టిన యట్లు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.66
అభోజయన్నభుఞ్జానో విత్తం వ్యర్థం కరోతి యః
స సస్యభూమౌ దృష్ట్యర్థం బద్ధః కృత్రిమమానుషః
తాము దిరుగుభూమి క్షామడాంబర మైనఁ
బరగుదేశమునకు జరుగవలయుఁ
గొల నటెండిపోవఁ గొక్కెరలుండునా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.67
స్వదేశం క్షామభూయిష్ఠం త్యక్త్వా దేశాన్తరం వ్రజేత్
బకః శుష్కం సరస్త్యక్త్వా యథాన్యద్ యాతి వై సరః
తిరిపెగాఁడయినను దిరిపె మెత్తినయట్టి
తిరిపెమందె తాను దిరిపె మిడిన
తిరిపెము తిరిపెమున దిగఁబడిపోవురా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.68
భిక్షయా ప్రాప్తమిత్యుక్త్వా న దద్యాత్ స్వేచ్ఛయా ధనమ్
భిక్షాలబ్ధం ధనం చాపి దత్తం సన్నశ్యతి ధ్రువమ్
తీపికెల్లఁ దీపి తెలియంగఁ బ్రాణంబు
ప్రాణవితతికన్నఁ బసిఁడి తీపి
పసిఁడికంటె మిగులఁ బడఁతిమాటలు తీపి[17]
విశ్వదాభిరామ వినురవేమ.                          4.69
మధురాన్మధురాః ప్రాణాః స్వర్ణం స్యాన్మధురం తతః |
తతోపి మధురం లోకే స్త్రీణాం మధురభాషితమ్
తెవలుబడ్డవాఁడు[18] దేవతాభక్తుండు
ఈఁటె లేనివాఁడు[19] పోటుబంటు
కాసులేనివాఁడు కడుబ్రహ్మచారియౌ
విశ్వదాభిరామ వినురవేమ.                          4.70
రోగార్తః తస్య శన్త్యర్థం భక్తిమాన్ జాయతే నరః
నిర్ధనో బ్రహ్మచారీ స్యాత్ మల్లః స్యాత్తు నిరాయుధః
తోటకూరకైన దొగ్గలికైనను
తవుటికుడుముకైనఁ దవిటికైనఁ
గావ్యములను జెప్పు ఘనులెల్ల ధనపరుల్
విశ్వదాభిరామ వినురవేమ.                          4.71
అపూపార్థం తుషార్థం వా శాకార్థం కవయో భువి
కుర్వన్తి కావ్యరత్నాని ధనార్జనపరాయణాః
దశగలారి నెల్ల తమబంధువు లటండ్రు
దశయు లేమి నెంత్రు తక్కువగను
ధశయనంగను ధనదశయొప్పు నొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ.                          4.72
వదేదుచ్ఛదశావన్తం బన్ధుమన్యమనాదరాత్
పశ్యేత్ ; ఏకా ధనదశా శ్రేష్ఠా సర్వదశాస్వపి
దశయనంగ మెండు ధనముంటయె యండ్రు
కూడు నిద్రలేక కుందుటెకద
రాఁగ నుండఁబోవ బాగుగా నేడ్పించు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.73
ధనాధిక్యం దశామాహుః నిద్రాహారౌ వినా హి తత్
రక్షణీయం, వ్యయే చాయే స్థితో దుఃఖకరం ధనమ్
దానములను జేయ ధర చేతులాడక
బహుధనంబుఁ గూర్చి పాతిపెట్టి
తుదను దండుగనిడి మొదలు చెడునరుఁడు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.74
జనా దానమకృత్వైవ స్థాపయన్తి ధనం భువి
తథా సత్యన్తతస్తేషాం నశ్యేన్మూలధనం వృథా
దినము మూఁడుమార్లు తిని నిదురించుచు
సొగసుచనులవారి సొంపుతోడఁ
జేరుచుండి ధనముఁ జెడుపకు మెప్పుడు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.75
వారత్రయం దినే భుక్త్వా సుప్త్వా సఙ్గమ్య చాఙ్గనాః
దుఃసాఙ్గత్యాద్ వృథా లోకే హా కుర్వన్తి ధనవ్యయమ్
దేశ దేశమ్ముఁ దిరుగుట తిండికొఱకె
పూని వేషము వేయుట పొట్టకొఱకె
మనసునందునె గుఱిఁగాంచి మమతవిడరు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.76
భుక్త్యర్థం  దేశసఞ్జారో వృత్త్యర్థం వేషధారణమ్
కిమర్థం ; హృది సద్వాక్యం నిధేహి మమతాం త్యజ
దేశవేషములను తేటసేయఁగ దేవుఁ
డాత్మలోన నుండు నణఁగి పెనఁగి
వేస మరసి చూడ గ్రాసంబు కొఱకయా
విశ్వదాభిరామ వినురవేమ.                          4.77
దేశాటనేన వేషేణ హరిర్ద్రష్టుం న శక్యతే
స చాస్తి చిత్తే ; భుక్త్యర్థం సర్వో వేషో వృథా తతః
దోసకారియైన దూపరివాఁడైన
బగతుఁడైన వేదబాహ్యుఁడైన
ధనికు నెల్లవారు తనియింపుచుందురు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.78
వేదబాహ్యో దోషకారీ దుష్టో వా శత్రురేవ వా
ధనికశ్చేత్ సదా లోకే తోష్యతే సేవ్యతే జనైః
ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
సటలనైన సాహసములనైన
సంపదధికువలన సాధింపఁదగు టొప్పు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.79
చౌర్యేణ ద్రోహబుద్ధ్యా వా సాహసేన శ్రమేణ వా
ధనం ధనికవర్యేభ్యః సదా సమ్పాదయేన్నరః
ధనము లేకయున్న ధైర్యంబు చిక్కదు
ధైర్య మొదవదేని ధన మొదవదు
ధనము ధైర్య మరయఁ దగుభూమి నరులకు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.80
ధైర్యం వినా ధనం న స్యాత్ న ధైర్యం ధనమన్తరా |
ధనం ధైర్యం ద్వయం లోకే నృణాం ముఖ్యం భవిష్యతి
ధనము లేమి గుణము తక్కువపడవచ్చు
ధనము లేమి కీర్తి తలఁగిపోవు
ధనము లేమి శుచిని తగఁ బుట్టనీయదు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.81
ధనాభావే గుణో నశ్యేత్ కీర్తిశ్చాపి వినశ్యతి
ధనాభావే శుచిత్వం చ న భవేద్ భూతలే నృణామ్
ధనము లేనిపేద తండ్రిగర్భంబున
భాగ్యపురుషుఁ డొకఁడు పరఁగఁబుట్టి
బహుళధనముఁగూర్చు భద్రంబులొనఁగూర్చు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.82
పుణ్యాద్దరిద్రదమ్పత్యోః జనిత్వా భాగ్యవాన్ సుతః
సమ్పాద్య బహులం విత్తం కురుతే లోకమఙ్గలమ్
ధనము లేమి యనుట దావానలంబగు
తన్నుఁ జెఱుచు మీఱి దాపుఁ జెఱుచు
ధనము లేమి మదిని తలఁపఁగా పాపంబు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.83
ధనాభావో దావవహ్నిసదృశః స్వాశ్రితైః సహ
స్మర్తారం నాశయేత్, తస్మాత్ పాపం దారిద్ర్యచిన్తనమ్
ధనము లేమి సుతులు తప్పుల నిడుదురు
ధనము లేమి పత్నిఁ దాఁకరాదు
ధనము లే మెవరికి తాళిక నీయదు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.84
పుత్రా అపి వినిన్దన్తి దరిద్రమ్, గృహిణీ పతిమ్
దరిద్రం న స్పృశేత్, కో వా దారిద్ర్యం సహతే భువి
ధనమౌ మూలము జగమునకు
ధనమౌ మూలంబు సకలధర్మంబునకు౯
గుణములు మూలము సిరులకు
మనమౌ మూలంబు ముక్తిమహిమకు వేమా!     4.85
ధనం హి జగతో హేతుః ధనం సర్వస్య కారణమ్
గుణో హి సమ్పదో హేతుః చిత్తం స్యాన్ముక్తికారణమ్
నక్కవినయములను నయగారములఁ బల్కి
కడకు ధనముఁ గూర్పఁ గడఁగుచుంద్రు
కుక్కబోనువాతఁ గూడు చల్లినరీతి
విశ్వదాభిరామ వినురవేమ.                          4.86
శ్వనిన్దకః స్వయం బధ్వా తస్మై చాన్నం ప్రయచ్ఛతి
అన్విష్యతి తథా విత్తం నిన్దన్నేవ ధనం ఖలః
నారాయణ నవచ్చు నమశివ యనవచ్చు
మేలువారిఁ జూచి[20] మెచ్చవచ్చు
కొంగుకాసు విడిచి గొబ్బున నీరాదు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.87
ఆత్మనోఽప్యుత్తమం స్తౌతి వక్తి నారాయణేతి
అథాపి గ్రన్థిమున్ముచ్య ధనం కిఞ్జిన్న యచ్ఛతి
పరఁగ లేమిచేత బంధువు ల్పగవారు
పరఁగ లేమి చేతఁ బరము తప్పు
పరఁగ లేమి చేతఁ బరపతియును దప్పు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.88
నిర్ధనం నేక్షతే బన్ధుః నిర్ధనస్య పరం పదమ్
న జాయతే ; నిర్ధనస్య ఋణం వాపి న లభ్యతే
పాగ పచ్చడంబు పైకిఁ గూసంబును
పోగు లుంగరములు బొజ్జకడుపుఁ
గలిగినట్టివానిఁ గందురు చుట్టాలు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.89
ఉష్ణీషకుణ్డలక్షౌమైః అఙ్గులీయమహోదరైః
భూషితస్య నరస్యైవ సర్వే తిష్ఠన్తి బాన్ధవాః
పాపపుణ్యములను పసిగా పెఱుంగునా
ధరను బరమయోగి యెఱుఁగుఁగాక
పసిఁడిపొందిక గని బాగుగాఁ గూర్పుము
విశ్వదాభిరామ వినురవేమ.                          4.90
పాపపుణ్యే యథా యోగీ వేత్తి, నో వేత్తి పామరః
జ్ఞాతస్వర్ణార్జనోపాయః తథా త్వం ధనమార్జయ
పాలసాగరమునఁ బవ్వళించిన హరి
గొల్లపల్లెపాలు గోరనేల
నెదుటివారిద్రవ్యమెల్లవారికిఁ దీపి
విశ్వదాభిరామ వినురవేమ.                          4.91
క్షీరాబ్ధిశయనో విష్ణుః క్షీరార్థం గోకులం యయౌ
పరవస్తుని సర్వేషాం రుచిః సఞ్జాయతే కిల
పుత్తడిగలవాని పుండుబాధయుఁ గూడ
వసుధలోనఁ జాలవార్తకెక్కు
పేదవానియింట పెండ్లైన నెఱుఁగ
విశ్వదాభిరామ వినురవేమ.                          4.91
వ్రణబాధా ధనాఢ్యస్య జాయతే లోకవిశ్రుతా
కో జానాతి వివాహం వా దరిద్రసదనే కృతమ్
పూర్వజన్మమందు పుణ్యంబు సేయని
పాపి తా ధనంబుఁ బడయ లేఁడు
విత్త మఱచి కోయ వెదకినచందంబు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.92
పూర్వపుణ్యం వినా లోకే నృణాం విత్తం న లభ్యతే
బీజావాపం వినా సస్యం ఛేత్తుం లభ్యేత కిం నృణామ్
వూసపోగుఁ బసిడిపుట్టంబు విద్యయుఁ
గాయపుష్టి చాలఁగలిగె నేని
కానికులజు నైన ఘనుఁడని రమ్మంద్రు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.93
కుణ్డలేనాఙ్గవస్త్రేణ కాయపుష్ట్యా చ విద్యయా
యుక్తశ్చేదకులీనోపి మహానితి స గణ్యతే
పేదవాని బాధ పెనుభూత మైయుండు
జాడలేదు బాధఁ జూడ వశమె
కలుగువానిబాధ కనులఁ జూడఁగ లేమి
కేమిచేయవచ్చు నింక వేమ!                         4.94
అహో దుఃఖం దరిద్రస్య న కశ్చిద్గణయేన్నరః
దుఃఖితే ధనికే ఖేదమసహ్య ఇతి భాషతే
ప్రాప్తిగల్గుచోట ఫల మిచ్చుదైవంబు
ప్రాప్తిలేనిచోట ఫలము లేదు
ప్రాప్తిలేక పసిఁడి పరమాత్ముడిచ్చునా?
విశ్వదాభిరామ వినురవేమ.                          4.95
ప్రాప్తవ్యం తు ఫలం యత్ర తత్ర తల్లభతే నరః |
దేవోపి ప్రాప్తిహీనస్య కథం దద్యాద్ధనం భువి
మగని కలిమిబలిమి మగువకును బలంబు
కలిమి లేనిమగఁడు కాసుఁగాఁడు
పనికిరానిమగని పాటించి చూడరు
విశ్వదాభిరామ వినురవేమ.                          4.96
బలం తదేవ నారీణాం యద్భర్తా బహుభాగ్యవాన్
వ్యర్థో హి నిర్ధనో భర్తా తం భార్యాపి న పశ్యతి
లేమిగల్గువాఁ డిఁకేమేమి చేసిన
కలిసిరాదు ఫలము కాసుగూడ
కలిమి గల్గుజోటఁ దులతూఁగుచుండును
విశ్వదాభిరామ వినురవేమ.                          4.97
ధనికేన కృతం సర్వం సఫలం జాయతే భువి
దరిద్రేణం కృతం సర్వం వ్యర్థం సన్న ఫలప్రదమ్
--::--


[1] గజపతింట నెన్న
[2] తలను చేయిబెట్టి ధనపరుల్ గమ్మను
[3] నన్నాధన మొప్పకుండ నందుచు సుఖముల్
[4] మన్నౌ గద మఱియునెల్ల
[5] ఓజమాలు మగువ కూలి మాడల చేటు
[6] లోడిగట్టి
[7] కన్నపుత్రు నాస కనకంబుపై నాస
[8] కనియుఁ గానకుండు గడుఠీవియా లేదు
[9] సంపద లేదేని సన్నిపాతము పూను
[10] కాసువాని
[11] కాకుస్థు
[12] మనుపు
[13] చేతఁ గాసు లేక చేసెడిదేమిటి
[14] వాడవారు
[15] లక్ష్మి తమకు తానె లభ్యమౌనని కాదె
[16] సుఖముఁ గోర ధనము సౌభాగ్యమును గోరు
[17] పసిడికంటె తీపి పరఁగెడునొ లేదొ
[18] తెలుపబడ్డవాడు
[19] మాట లేనివాడు
[20] మేలువారిఁ నమ్మి

No comments:

Post a Comment