వేమన పద్యాలు – సంస్కృతానువాదము
4. అర్థపద్ధతిః
అధముఁ డైన మనుజుఁ డర్థవంతుండైన
నతనిమాట నడచు నవనిలోన
గజపతింట నున్న[1] గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.1
నీచోఽపి ధనసమ్పన్నో భువి సర్వైర్మహీయతే ।
భూపం వరాటికా
ప్రాప్తా శ్లాఘ్యతే ఘనవత్ జనైః ॥
అధికభుక్తిచేత మొదటసొమ్ముకు హాని
కుదువసొమ్ముకన్నఁ గొంతహాని
మొదటిపక్షమునను మూలకర్తకు హాని
విశ్వదాభిరామ
వినురవేమ. 4.2
అతివ్యయాత్ మూలధనం నశ్యేత్ న్యాసేఽల్పమేవ చ ।
అతిభుక్త్యా
దేహనాశస్తస్మాత్కార్యో మితవ్యయః ॥
అప్పులేనివాఁడె యధికసంపన్నుండు
తప్పులేనివారు ధరను లేరు
గొప్పలేనిబుద్ధి కొంచెమైపోవురా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.3
అనృణో ధనికో గణ్యః ; ఋణాద్దోషో
భవేదితి ।
జ్ఞాత్వాపి
క్రియతే సర్వైః తేన నిన్ద్యా భవన్తి తే ॥
అరయఁ దఱచు కల్లలాడెడు వారింట
వెడల కేల లక్ష్మి విశ్రమించు
నీర మోటికుండ నిలువనిచందాన
విశ్వదాభిరామ
వినురవేమ. 4.4
అసత్యం సర్వదా యస్తు కథయేత్ తస్య
మన్దిరే ।
న తిష్ఠతి
ధ్రువం లక్ష్మీః జలం భిన్నఘటే యథా ॥
అర్థవంతుసొమ్ము నాసింతు రర్థులై
యర్థి కీయ సొమ్ము వ్యర్థమగును
వ్యర్థమైనసొమ్ము వ్యర్థులఁ జేరురా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.5
అలసాయ న దాతవ్యం విత్తమ్ , నో చేద్వినా
శ్రమమ్ ।
లబ్ధమేతదితి
జ్ఞాత్వా దుర్వ్యయేన స నాశయేత్ ॥
ఆఁడువారిగన్న నర్థంబు బొడగన్న
సారమైనరుచుల చవులఁ గన్న
అయ్యగారికైన నాశలు గలుగవా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.6
రమణీం చ తథా విత్తం మధురం
భక్ష్యమేవ చ |
దృష్ట్వా లబ్ధం
భవేదాశా మహతామపి దేహినామ్ ॥
ఆపదందుఁ జూడు మారయ బంధుల
భయము వేళఁ జూడు బంటుగుణము
పేదవడ్డవెనుకఁ బెండ్లముమతిఁ జూడు
విశ్వదాభిరామ వినురవేమ. 4.7
ఆపత్సాహ్యకరో బన్ధుః కిఙ్కరో
భయసాహ్యదః ।
దారిద్ర్యేపి చ
యా సాహ్యం కుర్యాద్భార్యేతి సా మతా ॥
ఆశచేత ధనము నార్జింపఁగా నేల
మట్టిక్రిందఁ బెట్టి మఱువనేల
ధనము పోవువెనుక ధర్మం బదేలరా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.8
అదత్వా స్వార్జితం విత్తమభుక్త్వా
ఖననాద్ధనమ్ ।
విస్మరన్తి
జనాః, నష్టే విత్తే ధర్మః కథం భవేత్ ॥
ఇంటిలోనిధనము నిది నాది యనుచు
మంటిలోన దాఁచు మంకుజీవి
కొంచుబోఁడు వెంట గుల్లకాసును రాదు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.9
మమేదం విత్తమిత్యుక్త్వా
తన్నిక్షిప్య క్షితేరధః ।
రక్షేన్మూఢో
మృత్యుకాలే కిం విత్తం సహ నేష్యతి ? ॥
ఇరుగుపొరుగువారి కెనయుసంపదఁ జూచి
తమకు లేదటన్న ధర్మమేమి
ధర్మమన్నఁ దొల్లి తన్నుక చచ్చిరి
విశ్వదాభిరామ
వినురవేమ. 4.10
దృష్ట్వా పరధనం లోకే చిన్తయా కిం
ప్రయోజనమ్ ।
పూర్వపుణ్యాద్భవేద్విత్తం
తదభావే వృథా శ్రమః ॥
ఇహమునందు చాల నిడుములు పడినను
బడుగు పొందగలఁడె పరమపదవి
పేద కనువుపడునె పృథివిపై భాగ్యంబు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.11
పూర్వపుణ్యం వినా యత్నాన్నరో
ముక్తిం న విన్దతి ।
పూర్వపుణ్యం
వినా భాగ్యం దరిద్రో నాప్నుయాద్ భువి ॥
ఇహమున సుఖియింప హేమతారకవిద్య
పరమున సుఖియింప బ్రహ్మవిద్య
కడమవిద్య లెల్ల గల్ల మూఢులకెరా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.12
ఇహ సౌఖ్యం స్వర్ణవిద్యా, బ్రహ్మవిద్యా
పరే సుఖమ్ ।
దదాత్యన్యాస్తు
విద్యాః స్యురఫలాః మూఢసేవితాః ॥
ఇహమునందు సుఖము లింపార లేదట
పరమువందు సుఖముఁ బడయు టెట్లు
ధనము లేక సుఖము తన కెట్లు కలుగురా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.13
ధనేనాత్ర భవేత్ సౌఖ్యం
దానపుణ్యాదముత్ర చ ।
ముక్తిః స్యాత్
, నిర్ధనః సౌఖ్యం నాప్నుయాల్లోకయోర్ద్వయోః ॥
ఈఁతకన్న లోఁతు నెంచంగఁ బనిలేదు
చావు కన్న గీడు జగతి లేదు
గోచిఁపాఁతకంటె గొంచెం బిఁకను లేదు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.14
జలే ప్లవనదక్షస్య నాగాధత్వభయం
భవేత్ ।
న దుఃఖం
మృత్యుకామస్మ న దారిద్ర్యభయం మునేః ॥
ఉచితవంతుఁ డైన నుద్యోగపరుఁడైన
సంప దమరియున్న సమయముననె
పరుల కుపకరించి పాలింపఁ గల్గును
విశ్వదాభిరామ
వినురవేమ. 4.15
సాత్త్వికో వా మహాస్థానగతో వా
నిర్ధనో నరః ।
పరోపకారం కిం
కుర్యాత్ రాజ్యం వా పాలయేత్ కథమ్ ॥
ఉన్నయంత మనుజుఁ డుపకారి గాలేక
కన్ను కానఁడంచు ఘనుఁడు వల్కు
దీనుఁ డై నతనకు దిక్కెవ్వరగుదురు?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.16
మదాన్ధోఽయం పరేషాం న దదాతీతి చ మానవాః ।
నిన్దన్తి
ధనికం తస్య దారిద్ర్యే కస్తు రక్షకః ॥
ఉప్పులేని కూర యొప్పదొ రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదొ
అప్పులేనివాఁడె యధికసంపన్నుఁడు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.17
అన్నం చ సూపరహితం శాకం లవణవర్జితమ్
।
భోక్తవ్యమ్ , న ఋణం
కార్యమనృణో ధనవాన్ భవేత్ ॥
ఉర్వివారికెల్ల నొక్కకంచముఁ బెట్టి
పొత్తుఁ గుడిపి కులము పొలయఁ జేసి
తలను చేయిపెట్టి తగ నమ్మఁజెప్పరో[2]!
విశ్వదాభిరామ
వినురవేమ. 4.18
జాతిసామ్యాదైకమత్యాదేకపాత్రాశనాత్
సుఖమ్ ।
అస్తీతి శీర్షే
నిక్షిప్య హస్తం శపథమాచర ॥
ఋణ మొసఁగు నాతఁ డినుఁడగుఁ దొలుదొల్త
నదియు మరల నడుగ యముఁడుగ నగు
అప్పుఁజేసి తీర్ప నఱయనివారికి
విశ్వదాభిరామ
వినురవేమ. 4.19
ఋణదాతా రవిః సాక్షాత్ ; తేన ప్రత్యర్ప్యతామితి
।
పృష్టో
దాతుమశక్తః సన్ తం పశ్యేద్యమదేవతామ్ ॥
ఎంతభూమి దిరిగి యేపాటు పడుచున్న
నంటనీక ప్రాప్తి వెంటఁ దిరుగు
భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.20
బహుదేశానటిత్వాపి నిర్భాగ్యో
నాప్నుయాత్ ధనమ్ ।
దేశా నూత్నాః, నరో భోక్తా
సర్వత్ర సమ ఏవ సః ॥
ఎద్దుమొద్దువాని కేలశాస్త్రంబులు
ముద్దునాతి కేల ముసలిమగఁడు
చద్దిమిగులనిల్లు సంసార మేలరా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.21
వృథా శాస్త్రం పశుప్రాయే, వృద్ధభర్తా
వృథా స్త్రియాః ।
పురాతనం గృహే
నో చేత్ జీవనం తత్ వృథా భవేత్ ॥
ఎన్నాళ్ళిలఁ దా నుండును
ఎన్నాళ్ళిలఁ దాను నేర్చు నెన్నిఁట వెలయ౯[3]
గొన్నాళ్ళకుఁ దాఁ జనినను
మన్నౌఁగద విద్యలెల్ల[4] మహిలో వేమా! 4.22
స్వల్పమాయుః ధ్రువో మృత్యుః
కియత్తత్ర పఠేన్నరః ।
అధీతం చ మృతం
తస్మిన్ నశ్యేత్ ముక్తౌ మనః కురుః ॥
ఓజమాలునగును ఓడిమాడలచేటు[5]
పాటులేని మగఁడు కూటిచేటు
పనికిమాలు దాసి బత్తెంబు చేటురా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.23
వ్యర్థో వ్యయో మూఢభార్యావివాహాత్ ; అలసాయ తు ।
దత్తమన్నం వృథా
; మూఢదాస్యై వ్యర్థం తు వేతనమ్ ॥
కట్టెపేరు లోలిగట్టి[6] చెప్పఁగ రాదు
కానరాక యున్నె కలిమితనము
జంగమైనవాని జాతి గన్పడదొకో
విశ్వదాభిరామ
వినురవేమ. 4.24
వేషేణ ధనవాన్ న స్యాదస్తి చేత్
జ్ఞాయతే స్వయమ్ ।
జఙ్గమాఖ్యా
శైవజాతిః దర్శనాత్ జ్ఞాయతే కిల ॥
కడుపునిండఁ దవుడు గంపలోఁ బెట్టిన
జన్నుఁ బట్టనీక తన్ను గేదె
వారకాంత లెట్లు వలతురో యూఱక?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.25
పూర్ణాహారప్రదం చాపి మహిషీ
స్తనమర్దనే ।
పద్భ్యాం
చేత్తాడయేత్ , కిన్ను వక్తవ్యం కులటాం ప్రతి ॥
కనకపర్వతమునఁ గాపురం బుండిన
ననిమిషేశ్వరునకు నాసపోదు
కనకకుండలములు కర్ణుని నడుగఁడా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.26
ఇన్ద్రః స్వర్ణాచలస్థోపి యయాచే
స్వర్ణకుణ్డలే ।
కర్ణం ధనేచ్ఛయా
; లోకే విత్తాశా దుస్త్యజా నృణామ్ ॥
కనకమృగము భువిని కద్దు లే దనలేక
తరుణి విడిచిపోడె దాశరథియు
దైవమైన ధనము దలఁచుచుండెను గాదె
విశ్వదాభిరామ
వినురవేమ. 4.27
లోకే స్వర్ణమృగః
స్యాద్వేత్యనాలోచ్యైవ రాఘవః ।
తమన్వగాత్ వినా
సీతామ్ , దేవస్యాపి ధనే స్పృహా ॥
కనక మున్నవాఁడు కాముఁడు భీముఁడు
మిగులఁ దేజమంది మెలఁగుచుండు
విత్తహీనుఁడైన వెఱ్ఱులలోనేటు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.28
ధనికో మదనో భీమస్తేజస్వీత్యుచ్యతే
జనైః ।
దరిద్రం
కీర్తియుక్తం చ మూర్ఖేషు ప్రథమం విదుః ॥
ఉన్న ఘనతఁబట్టి మన్నింతురేగాని[7]
పిన్న పెద్దతనము లెన్నఁబోరు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.29
మహత్త్వం గౌరవే హేతుః న వయస్తత్ర
కారణమ్ ।
వసుదేవం
పరిత్యజ్య వాసుదేవం నమన్తి హి ॥
కనియుఁ గానకుండుఁ గదలింపఁ డానోరు[8]
వినియు వినకయుండు విస్మయంబు
సంపద గలవాని సన్నిపాతక మిది[9]
విశ్వదాభిరామ
వినురవేమ. 4.30
ఆఢ్యో దరిద్రవిషయం పశ్యన్నపి న
పశ్యతి ।
శృణ్వన్ వా న శృణోత్యేషః
సన్నిపాతజ్వరో మహాన్ ॥
కన్నెమీఁది యాస కనకంబుపై నాస
లేనివాఁడు పుడమి లేనివాఁడు
కలిగెనే నతండు కానంగ రాఁడయా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.31
కనకం కామినీం దృష్ట్వా సర్వేషాం
జాయతే స్పృహా ।
యది స్యాత్
నిస్పృహః కశ్చిదదృష్టః స వసేద్రహః ॥
కమ్మరీని దుడుకు కార్యవినాశంబు
వడ్లవాని దుడుకు వాలపిడుగు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.32
కర్మారతక్షకౌ వేగే కార్యం నాశయతః
క్షణాత్ ।
తత్ సాధయేత్
రాజదూతః త్వరితో రామబాణవత్ ॥
కర్ణుఁడొకఁడెగాని ఘను లెవ్వరును లేరు
దానశీలుఁ డంచు తలఁపఁబడెను
తలఁప ధనము కర్ణు దాతఁ జేసెను సుమీ
విశ్వదాభిరామ
వినురవేమ. 4.33
కర్ణ ఏకో దానశీలః తత్సమో నాస్తి
భూతలే ।
ఇతి కీర్తిం
స్థిరాం కర్ణో ధనమూలామవిన్దత ॥
కలిగినమనుజుండు కాముఁడై సోముఁడై
మిగుల తేజమునను మెఱయుచుండు
విత్తహీనుఁడైన నుత్తసన్న్యాసిరా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.34
ధనవాన్ కామతుల్యః స్యాత్ తేజస్వీ
సోమసన్నిభః ।
ధనహీనమనుష్యస్తు
సన్న్యాసిసదృశో భవేత్ ॥
కలిగి ధర్మ మీయఁ గాననివారును
కలిగి తినక చాల గ్రాగువారు
కలిమి నెచటఁ జూడఁ గానక చెడుదురు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.35
న దదాతి న భుఙ్క్తే యో విత్తే
సత్యపి పుష్కలే ।
భావిజన్మస్వపి
ధనమదృష్ట్వా స వినశ్యతి ॥
కలిమి యున్న వానిఁ గని పట్టి యిచ్చిన
మనువు[12]బొంగుపాలు మఱగినట్లు
లోన నిగిరి కలిమి లొట్టపోయెడునొకో
విశ్వదాభిరామ
వినురవేమ. 4.36
ధనికాయ సుతాదానాత్ బాన్ధవ్యం
తప్తదుగ్ధవత్ ।
వర్ధతే సతతమ్ ; శుష్కం భూత్వా
భాణ్డే న నశ్యతి ॥
కలిమి కలిగియుండి కఠినభావముఁ జెంది
తెలియ లేరు ప్రజలు తెలివిలేక
కలిమి వెన్నెలగతిఁ గానంగ లేరయా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.37
సమ్పన్నో దయయా హీనః “సమ్పత్
జ్యోత్స్నేవ చఞ్చలా” ।
ఇతి సత్యం న
జానాతి వైచక్షణ్యవివర్జిత ॥
కలిమి కలిగెనేని గాముఁగాఁ జూతురు
లేమి చేతఁ జిక్క లేమ లధిపు
మదనువంటివాని మాలఁగాఁ జూతురు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.38
కురూపం చాపి ధనికం మదనం మన్యతేఽబలా ।
దరిద్రం
కామతుల్యఞ్చ నారీ చణ్డాలమీక్షతే ॥
కలిమి గలుగ సకలకులముల కెక్కువ
కలిమి భోగభాగ్యములకు నెలవు
కలిమి లేనివానికుల మేమి కులమయా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.39
ధనికః శ్రేష్ఠకులవాన్ భోగభాగ్యే
భజేత సః ।
కథం
స్యాదుత్తమకులమధనస్య కులం భువి ॥
కలిమిఁ జూచి యీయఁ గాయ మిచ్చినయట్లు
సము నకీయ నదియు సరసతనము
పేద కిచ్చు మనువు పెనవేసినట్లురా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.40
ఆఢ్యాయ కన్యకాదానం స్వాత్మార్పణసమం
భవేత్ ।
సమాయ
దానముచితమ్ , దరిద్రే దానముత్తమమ్ ॥
కలిమినాఁడు మగనిఁ గామించి చూచును
లేమిఁ జిక్కునాఁడు లేవకుండు
మనినమగనినైన మడియంగఁ జూచును
విశ్వదాభిరామ
వినురవేమ. 4.41
విత్తాఢ్యం కామయేద్భార్యా నిర్ధనం
నైవ పశ్యతి ।
జీవితాదస్య
మరణం వరమిత్యపి సా వదేత్ ॥
కాంచనంబుపైనఁ గాంతలపైనను
బమ్మకైనఁ బుట్టు రిమ్మతెగులు
తోయజాక్షి విడుచు దొరయెవ్వఁరును లేఁరు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.42
కన్యకాం కనకం దృష్ట్వా బ్రహ్మాపి
కిల ముహ్యతి ।
స్త్రియం
కమలపత్రాక్షీం కో వా భువి పరిత్యజేత్ ॥
కాంచనంబుమీఁది కాంక్ష మోహ మటండ్రు
విడువలేరు దాని విబుధులైన
కాంక్షలేనివారు కానఁగా రారయా
విశ్వదాభిరామ వినురవేమ. 4.43
స్వర్ణాశాం ప్రాహురజ్ఞానం
ప్రాజ్ఞాః, న త్యజ్యతే చ తైః ।
కనకం యే న వాఞ్ఛన్తి
భువి తే దుర్లభా నరాః ॥
కావవలయు ధనముఁ గాంత నెల్లప్పుడు
కావలేనివాఁడు చావవలయు
కాపులేనిదాని కాపుర మడుగునా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.44
నారీం విత్తం సదా రక్షేత్ నో
చేన్మరణముత్తమమ్ ।
అరక్షతః
స్త్రియంవిత్తం జీవనం నిష్ఫలం భవేత్ ॥
కుడువఁ గూడు లేక కూడఁబెట్టఁగ లేక
విడువ ముడువ లేక గడన లేక
నడువ సాగకున్న నడపీనుఁ గందురు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.45
న భోజయేత్ న భుఙ్క్తే యో భువి
విత్తార్జనం వినా ।
కుటుమ్బం యో న
రక్షేత్ తం లోకే జీవచ్ఛవం విదుః ॥
కులము గలుగు వారు గోత్రంబు గలవారు
విద్యచేత విఱ్ఱవీగువారు
పసిఁడి గల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.46
కులీనో గోత్రసమ్పన్నః సర్వవిద్యా
విశారదః ।
ఇమే సర్వే
ధనాఢ్యస్య దాసీపుత్రసమా మతాః ॥
కులము లేనివాఁడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న నెన్నఁ గలిమి ప్రధానంబు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.47
అకులీనోపి భాగ్యేన కులీనః
స్యాదభాగ్యవాన్ ।
కులీనోఽప్యకులీనః స్యాత్ భాగ్యం శ్రేష్ఠం కులాదపి ॥
కులుకుగుబ్బఁ జూపి గొబ్బున వలపించి
చేతికాసులెల్లఁ జేరఁదీయ
నతనుచేతికత్తులమరంగఁ గాంతలు[13]
విశ్వదాభిరామ
వినురవేమ. 4.48
దర్శయిత్వా స్తనౌ విత్తం గృహ్ణత్యో
మానవాత్ స్త్రియః ।
కామహస్తకృపాణేన
సదృశాః స్యుర్భయావహాః ॥
కూరలేనితిండి కుక్కతిం డనిపించు
మాఱులేనితిండి మాలతిండి
ధారలేనితిండి దయ్యపుతిండిరా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.49
శాకం పత్రం ఘృతం త్యక్త్వా
క్రియమాణం తు భోజనమ్ ।
శ్వచణ్డాలపిశాచాది
భోజనేన సమం క్రమాత్ ॥
కూలినాలిఁ జేసి గుల్లాముపనిచేసి
తెచ్చిపెట్ట నాలు మెచ్చుచుండు
లేమిఁ జిక్కువిభుని వేమాఱు దిట్టును
విశ్వదాభిరామ
వినురవేమ. 4.50
ధనం యో నీచవృత్త్యా వా లబ్ధ్వా
పత్న్యై ప్రయచ్ఛతి ।
తం స్తౌతి
పత్నీ, దారిద్ర్యే నిన్దేత్ సా బహుధా పతిమ్ ॥
కోమటి మదిఁ గోరు క్షామమే యెల్లెడ
వైద్యుఁ డొరుల కెపుడు వ్యాధిఁ గోరు
ఊరివాఁడు[14] ధనికుఁ జేరఁగాఁ
గోరును
విశ్వదాభిరామ
వినురవేమ. 4.51
వైశ్యః క్షామం సదా వాఞ్ఛేత్ వైద్యో
రోగం సదా జనే ।
పౌరా
ధనికమన్విష్య వస్తుమిచ్ఛన్తి తేన హి ॥
చదువుందుఁ బాడి సౌఖ్యములందును
పెదవులందు రాజ్యపదవులందు
నాశ లుడిగినట్టి యయ్యలు గలరొకో
విశ్వదాభిరామ
వినురవేమ. 4.52
విద్యాం సౌఖ్యం తథా స్థానం
స్త్రీణామధరపల్లవమ్ ।
దృష్ట్వాపి
నిఃస్పృహః కశ్చిన్నరః కిం భువి వర్తతే ॥
చమురు గల్గు దివ్వె సంతోషముగ వెల్గు
ధనము గలుగువాని తలఁపుఁ జెలఁగు
ధనము లేనివాని తలఁపులు తీరునా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.53
తైలే సతి యథా దీపో భవేదాఢపస్య
వాఞ్ఛితమ్ ।
వర్ధమానం
దరిద్రాశా నశ్యేత్ నిఃస్నేహదీపవత్ ॥
చావు నేఁడొ రేపొ జతపడివచ్చును
పెక్కునాళ్లు కూడఁ బెట్టనేల
అనుచు నాశ లుడిగినంతటివారేరి?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.54
“అద్య శ్వో వా
ధ్రువో మృత్యుః కిం ఫలం ధనరక్షణే” ।
ఇత్యుక్త్వా
నిఃస్పృహః కోఽపి దాతా లోకే న దృశ్యతే ॥
జడలుదాల్చు టెల్ల జగము సీ యనుటెల్ల
నొడలు విఱుచునట్టియోగ మెల్ల
ముక్తికాంతఁబట్టి ముద్దాడుకొఱకురా?
జటాభారో లోకనిన్దా
యోగాద్దేహపరిశ్రమః ।
తత్ సర్వం
ముక్తికాన్తాయాః ప్రాప్త్యర్థం క్రియతే నరైః ॥
టంక మదుకకున్నఁ బొంకంబు గారాదు
స్వర్ణ భూషణంబు జగమెఱుంగు
భటుఁడు వెంట లేక ప్రభుఁడు శోభించునా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.56
సేవకం పురతః కృత్వా ధనికో భువి
రాజతే ।
కనకం చూర్ణసంయుక్తం
ధత్తే భూషణతాం యథా ॥
డిందుపడిన వాని నెందును లెక్కింప
రిందు నందుఁ గాన నెట్టులయిన
మందమతివి గాక మహిమతో నుండుము
విశ్వదాభిరామ
వినురవేమ. 4.57
భాగ్యభ్రష్టః పరే లోకే భువి వా న
హి గణ్యతే ।
తస్మాదర్థార్జనపరః
కీర్త్యా సహ వసేన్నరః ॥
డొక్క లెండిపోవు డొక్కు తానయ్యును
మమత మానఁగలడె మానవుండు
కాన ధనముఁగూర్పఁగడఁగుము జ్ఞానివై
విశ్వదాభిరామ
వినురవేమ. 4.58
దారిద్ర్యాత్ శుష్కకాయోపి మమతాం న
విముఞ్చతి ।
అతో బుద్ధిమతా
విత్తమర్జనీయం సుఖేప్సునా ॥
తమకు బంధు వనుచు తానె తోడుకవచ్చి
కలిమిఁ గలయఁ జూచి కాంక్షపడుచు
దక్షిణల నొసంగి తరుణి నీయఁగఁజూచు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.59
ధనికం బన్ధురిత్యుక్త్వా నరాః
కన్యాం సుదక్షిణామ్ |
తస్మై దత్త్వా
చ బాన్ధవ్యమిచ్ఛన్తి ధనకాంక్షయా ॥
తఱుచు కల్లలాడు ధరణీశు లిండ్లలో
వేళవేళ లక్ష్మి వెడలిపోవు
నోటికుండలోన నుండునా నీరంబు?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.60
అసత్యభాషిణో రాజ్ఞో మన్దిరాద్యాతి
పద్మజా ।
యథా జలం
భిన్నఘటాన్నిర్యాతి క్రమశో భువి ॥
తరుణి సుతులు ధనము ధాన్యముల్ సంపద
లెంతచుట్టుకొనిన నంతచేటు
పసిరికాయ పురుగుపద్ధతి గానరో
విశ్వదాభిరామ
వినురవేమ. 4.61
పత్నీసుతధనైః సమ్యక్ బద్ధో మర్త్యో
వినశ్యతి ।
స్వసృష్టతన్తుబద్ధః
సన్నూర్ణనాభో యథా స్వయమ్ ॥
తలను బాగపైని దగుపచ్చడము బొజ్జ
చెవులపోగు లరసి చేరు నర్థి
శుద్ధపశువు లనుచు బుద్ధిలో నరయక[16]
విశ్వదాభిరామ
వినురవేమ. 4.62
ఉష్ణీషకుణ్డలక్షౌమమణ్డితో యాచకః
ప్రభుమ్ ।
పశుప్రాయం
దానశూన్యమజ్ఞాత్వా సేవతే వృథా ॥
తల్లి బిడ్డలకును దగవు పుట్టించెడు
ధనము సుఖముఁ గూర్ప దని వచింత్రు
కాని గడన లేక గడచుట యెట్లురా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.63
జననీసుతయోర్విత్తం విరోధం జనయేదితి
।
వదన్తి, కిన్తు సంసారః
కథం స్యాత్ ధనమన్తరా ॥
తళుకు బెళుకుఁ జూచి ధరలోనిజను లెల్ల
కద్దు లే దటండ్రు ఘనతగాను
ఇదిగొయదిగొ యనుచు నిఁక నెక్కడందురు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.64
సర్వోపి కురుతే సద్యః శ్రుత్వా
ధనికవాఞ్ఛితమ్ ।
దరిద్రం తత
ఇత్యుక్త్వా బ్రూయాన్నాస్తీతి చాన్తతః ॥
తవిటికరయఁ బోవఁ దండులంబుల గంప
శ్వాన మాశ్రయించు సామ్యముగను
వైశ్యవరునిసొమ్ము వసుధ నీచుల కబ్బు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.65
తుషార్థం గచ్ఛతోఽన్యత్ర తణ్డులః స్యాత్ శ్వభక్షితః ।
అరక్షితం
వైశ్యధనం తథా నీచవశం భవేత్ ॥
తాను గుడువ లేఁడు తగవేది యాప్తులఁ
జేరనీయఁ డట్టి చెనటి పశువు
చేనిలోన బొమ్మఁజేసి కట్టిన యట్లు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.66
అభోజయన్నభుఞ్జానో విత్తం వ్యర్థం
కరోతి యః
స సస్యభూమౌ
దృష్ట్యర్థం బద్ధః కృత్రిమమానుషః ॥
తాము దిరుగుభూమి క్షామడాంబర మైనఁ
బరగుదేశమునకు జరుగవలయుఁ
గొల నటెండిపోవఁ గొక్కెరలుండునా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.67
స్వదేశం క్షామభూయిష్ఠం త్యక్త్వా
దేశాన్తరం వ్రజేత్ ।
బకః శుష్కం
సరస్త్యక్త్వా యథాన్యద్ యాతి వై సరః ॥
తిరిపెగాఁడయినను దిరిపె మెత్తినయట్టి
తిరిపెమందె తాను దిరిపె మిడిన
తిరిపెము తిరిపెమున దిగఁబడిపోవురా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.68
భిక్షయా ప్రాప్తమిత్యుక్త్వా న
దద్యాత్ స్వేచ్ఛయా ధనమ్ ।
భిక్షాలబ్ధం
ధనం చాపి దత్తం సన్నశ్యతి ధ్రువమ్ ॥
తీపికెల్లఁ దీపి తెలియంగఁ బ్రాణంబు
ప్రాణవితతికన్నఁ బసిఁడి తీపి
పసిఁడికంటె మిగులఁ బడఁతిమాటలు తీపి[17]
విశ్వదాభిరామ
వినురవేమ. 4.69
మధురాన్మధురాః ప్రాణాః స్వర్ణం
స్యాన్మధురం తతః |
తతోపి మధురం
లోకే స్త్రీణాం మధురభాషితమ్ ॥
తెవలుబడ్డవాఁడు[18] దేవతాభక్తుండు
ఈఁటె లేనివాఁడు[19] పోటుబంటు
కాసులేనివాఁడు కడుబ్రహ్మచారియౌ
విశ్వదాభిరామ
వినురవేమ. 4.70
రోగార్తః తస్య శన్త్యర్థం
భక్తిమాన్ జాయతే నరః ।
నిర్ధనో
బ్రహ్మచారీ స్యాత్ మల్లః స్యాత్తు నిరాయుధః ॥
తోటకూరకైన దొగ్గలికైనను
తవుటికుడుముకైనఁ దవిటికైనఁ
గావ్యములను జెప్పు ఘనులెల్ల ధనపరుల్
విశ్వదాభిరామ
వినురవేమ. 4.71
అపూపార్థం తుషార్థం వా శాకార్థం
కవయో భువి ।
కుర్వన్తి
కావ్యరత్నాని ధనార్జనపరాయణాః ॥
దశగలారి నెల్ల తమబంధువు లటండ్రు
దశయు లేమి నెంత్రు తక్కువగను
ధశయనంగను ధనదశయొప్పు నొక్కటే
విశ్వదాభిరామ
వినురవేమ. 4.72
వదేదుచ్ఛదశావన్తం
బన్ధుమన్యమనాదరాత్ ।
పశ్యేత్ ; ఏకా ధనదశా
శ్రేష్ఠా సర్వదశాస్వపి ॥
దశయనంగ మెండు ధనముంటయె యండ్రు
కూడు నిద్రలేక కుందుటెకద
రాఁగ నుండఁబోవ బాగుగా నేడ్పించు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.73
ధనాధిక్యం దశామాహుః నిద్రాహారౌ
వినా హి తత్ ।
రక్షణీయం, వ్యయే చాయే
స్థితో దుఃఖకరం ధనమ్ ॥
దానములను జేయ ధర చేతులాడక
బహుధనంబుఁ గూర్చి పాతిపెట్టి
తుదను దండుగనిడి మొదలు చెడునరుఁడు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.74
జనా దానమకృత్వైవ స్థాపయన్తి ధనం
భువి ।
తథా
సత్యన్తతస్తేషాం నశ్యేన్మూలధనం వృథా ॥
దినము మూఁడుమార్లు తిని నిదురించుచు
సొగసుచనులవారి సొంపుతోడఁ
జేరుచుండి ధనముఁ జెడుపకు మెప్పుడు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.75
వారత్రయం దినే భుక్త్వా సుప్త్వా
సఙ్గమ్య చాఙ్గనాః ।
దుఃసాఙ్గత్యాద్
వృథా లోకే హా కుర్వన్తి ధనవ్యయమ్ ॥
దేశ దేశమ్ముఁ దిరుగుట తిండికొఱకె
పూని వేషము వేయుట పొట్టకొఱకె
మనసునందునె గుఱిఁగాంచి మమతవిడరు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.76
భుక్త్యర్థం దేశసఞ్జారో వృత్త్యర్థం వేషధారణమ్ ।
కిమర్థం ; హృది సద్వాక్యం
నిధేహి మమతాం త్యజ ॥
దేశవేషములను తేటసేయఁగ దేవుఁ
డాత్మలోన నుండు నణఁగి పెనఁగి
వేస మరసి చూడ గ్రాసంబు కొఱకయా
విశ్వదాభిరామ
వినురవేమ. 4.77
దేశాటనేన వేషేణ హరిర్ద్రష్టుం న
శక్యతే ।
స చాస్తి
చిత్తే ; భుక్త్యర్థం సర్వో వేషో వృథా తతః ॥
దోసకారియైన దూపరివాఁడైన
బగతుఁడైన వేదబాహ్యుఁడైన
ధనికు నెల్లవారు తనియింపుచుందురు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.78
వేదబాహ్యో దోషకారీ దుష్టో వా
శత్రురేవ వా ।
ధనికశ్చేత్ సదా
లోకే తోష్యతే సేవ్యతే జనైః ॥
ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
సటలనైన సాహసములనైన
సంపదధికువలన సాధింపఁదగు టొప్పు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.79
చౌర్యేణ ద్రోహబుద్ధ్యా వా సాహసేన
శ్రమేణ వా ।
ధనం
ధనికవర్యేభ్యః సదా సమ్పాదయేన్నరః ॥
ధనము లేకయున్న ధైర్యంబు చిక్కదు
ధైర్య మొదవదేని ధన మొదవదు
ధనము ధైర్య మరయఁ దగుభూమి నరులకు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.80
ధైర్యం వినా ధనం న స్యాత్ న ధైర్యం
ధనమన్తరా |
ధనం ధైర్యం
ద్వయం లోకే నృణాం ముఖ్యం భవిష్యతి ॥
ధనము లేమి గుణము తక్కువపడవచ్చు
ధనము లేమి కీర్తి తలఁగిపోవు
ధనము లేమి శుచిని తగఁ బుట్టనీయదు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.81
ధనాభావే గుణో నశ్యేత్ కీర్తిశ్చాపి
వినశ్యతి ।
ధనాభావే
శుచిత్వం చ న భవేద్ భూతలే నృణామ్ ॥
ధనము లేనిపేద తండ్రిగర్భంబున
భాగ్యపురుషుఁ డొకఁడు పరఁగఁబుట్టి
బహుళధనముఁగూర్చు భద్రంబులొనఁగూర్చు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.82
పుణ్యాద్దరిద్రదమ్పత్యోః జనిత్వా
భాగ్యవాన్ సుతః ।
సమ్పాద్య బహులం
విత్తం కురుతే లోకమఙ్గలమ్ ॥
ధనము లేమి యనుట దావానలంబగు
తన్నుఁ జెఱుచు మీఱి దాపుఁ జెఱుచు
ధనము లేమి మదిని తలఁపఁగా పాపంబు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.83
ధనాభావో దావవహ్నిసదృశః స్వాశ్రితైః
సహ ।
స్మర్తారం
నాశయేత్, తస్మాత్ పాపం దారిద్ర్యచిన్తనమ్ ॥
ధనము లేమి సుతులు తప్పుల నిడుదురు
ధనము లేమి పత్నిఁ దాఁకరాదు
ధనము లే మెవరికి తాళిక నీయదు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.84
పుత్రా అపి వినిన్దన్తి దరిద్రమ్, గృహిణీ పతిమ్ ।
దరిద్రం న
స్పృశేత్, కో వా దారిద్ర్యం సహతే భువి ॥
ధనమౌ మూలము జగమునకు
ధనమౌ మూలంబు సకలధర్మంబునకు౯
గుణములు మూలము సిరులకు
మనమౌ మూలంబు ముక్తిమహిమకు
వేమా! 4.85
ధనం హి జగతో హేతుః ధనం సర్వస్య
కారణమ్ ।
గుణో హి సమ్పదో
హేతుః చిత్తం స్యాన్ముక్తికారణమ్ ॥
నక్కవినయములను నయగారములఁ బల్కి
కడకు ధనముఁ గూర్పఁ గడఁగుచుంద్రు
కుక్కబోనువాతఁ గూడు చల్లినరీతి
విశ్వదాభిరామ
వినురవేమ. 4.86
శ్వనిన్దకః స్వయం బధ్వా తస్మై
చాన్నం ప్రయచ్ఛతి ।
అన్విష్యతి తథా
విత్తం నిన్దన్నేవ ధనం ఖలః ॥
నారాయణ నవచ్చు నమశివ యనవచ్చు
మేలువారిఁ జూచి[20] మెచ్చవచ్చు
కొంగుకాసు విడిచి గొబ్బున నీరాదు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.87
ఆత్మనోఽప్యుత్తమం స్తౌతి వక్తి నారాయణేతి చ ।
అథాపి
గ్రన్థిమున్ముచ్య ధనం కిఞ్జిన్న యచ్ఛతి ॥
పరఁగ లేమిచేత బంధువు ల్పగవారు
పరఁగ లేమి చేతఁ బరము తప్పు
పరఁగ లేమి చేతఁ బరపతియును దప్పు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.88
నిర్ధనం నేక్షతే బన్ధుః నిర్ధనస్య
పరం పదమ్ ।
న జాయతే ; నిర్ధనస్య ఋణం
వాపి న లభ్యతే ॥
పాగ పచ్చడంబు పైకిఁ గూసంబును
పోగు లుంగరములు బొజ్జకడుపుఁ
గలిగినట్టివానిఁ గందురు చుట్టాలు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.89
ఉష్ణీషకుణ్డలక్షౌమైః
అఙ్గులీయమహోదరైః ।
భూషితస్య
నరస్యైవ సర్వే తిష్ఠన్తి బాన్ధవాః ॥
పాపపుణ్యములను పసిగా పెఱుంగునా
ధరను బరమయోగి యెఱుఁగుఁగాక
పసిఁడిపొందిక గని బాగుగాఁ గూర్పుము
విశ్వదాభిరామ
వినురవేమ. 4.90
పాపపుణ్యే యథా యోగీ వేత్తి, నో వేత్తి
పామరః ।
జ్ఞాతస్వర్ణార్జనోపాయః
తథా త్వం ధనమార్జయ ॥
పాలసాగరమునఁ బవ్వళించిన హరి
గొల్లపల్లెపాలు గోరనేల
నెదుటివారిద్రవ్యమెల్లవారికిఁ దీపి
విశ్వదాభిరామ
వినురవేమ. 4.91
క్షీరాబ్ధిశయనో విష్ణుః క్షీరార్థం
గోకులం యయౌ ।
పరవస్తుని
సర్వేషాం రుచిః సఞ్జాయతే కిల ॥
పుత్తడిగలవాని పుండుబాధయుఁ గూడ
వసుధలోనఁ జాలవార్తకెక్కు
పేదవానియింట పెండ్లైన నెఱుఁగ
విశ్వదాభిరామ
వినురవేమ. 4.91
వ్రణబాధా ధనాఢ్యస్య జాయతే
లోకవిశ్రుతా ।
కో జానాతి
వివాహం వా దరిద్రసదనే కృతమ్ ॥
పూర్వజన్మమందు పుణ్యంబు సేయని
పాపి తా ధనంబుఁ బడయ లేఁడు
విత్త మఱచి కోయ వెదకినచందంబు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.92
పూర్వపుణ్యం వినా లోకే నృణాం
విత్తం న లభ్యతే ।
బీజావాపం వినా
సస్యం ఛేత్తుం లభ్యేత కిం నృణామ్ ॥
వూసపోగుఁ బసిడిపుట్టంబు విద్యయుఁ
గాయపుష్టి చాలఁగలిగె నేని
కానికులజు నైన ఘనుఁడని రమ్మంద్రు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.93
కుణ్డలేనాఙ్గవస్త్రేణ కాయపుష్ట్యా
చ విద్యయా ।
యుక్తశ్చేదకులీనోపి
మహానితి స గణ్యతే ॥
పేదవాని బాధ పెనుభూత మైయుండు
జాడలేదు బాధఁ జూడ వశమె
కలుగువానిబాధ కనులఁ జూడఁగ లేమి
కేమిచేయవచ్చు నింక వేమ! 4.94
అహో దుఃఖం దరిద్రస్య న
కశ్చిద్గణయేన్నరః ।
దుఃఖితే ధనికే
ఖేదమసహ్య ఇతి భాషతే ॥
ప్రాప్తిగల్గుచోట ఫల మిచ్చుదైవంబు
ప్రాప్తిలేనిచోట ఫలము లేదు
ప్రాప్తిలేక పసిఁడి పరమాత్ముడిచ్చునా?
విశ్వదాభిరామ
వినురవేమ. 4.95
ప్రాప్తవ్యం తు ఫలం యత్ర తత్ర
తల్లభతే నరః |
దేవోపి
ప్రాప్తిహీనస్య కథం దద్యాద్ధనం భువి ॥
మగని కలిమిబలిమి మగువకును బలంబు
కలిమి లేనిమగఁడు కాసుఁగాఁడు
పనికిరానిమగని పాటించి చూడరు
విశ్వదాభిరామ
వినురవేమ. 4.96
బలం తదేవ నారీణాం యద్భర్తా
బహుభాగ్యవాన్ ।
వ్యర్థో హి
నిర్ధనో భర్తా తం భార్యాపి న పశ్యతి ॥
లేమిగల్గువాఁ డిఁకేమేమి చేసిన
కలిసిరాదు ఫలము కాసుగూడ
కలిమి గల్గుజోటఁ దులతూఁగుచుండును
విశ్వదాభిరామ
వినురవేమ. 4.97
ధనికేన కృతం సర్వం సఫలం జాయతే భువి
।
దరిద్రేణం కృతం
సర్వం వ్యర్థం సన్న ఫలప్రదమ్ ॥
--::--
[1]
గజపతింట నెన్న
[2]
తలను చేయిబెట్టి ధనపరుల్ గమ్మను
[3]
నన్నాధన మొప్పకుండ నందుచు సుఖముల్
[4]
మన్నౌ గద మఱియునెల్ల
[5]
ఓజమాలు మగువ కూలి మాడల చేటు
[6]
లోడిగట్టి
[7]
కన్నపుత్రు నాస కనకంబుపై నాస
[8]
కనియుఁ గానకుండు గడుఠీవియా లేదు
[9]
సంపద లేదేని సన్నిపాతము పూను
[10]
కాసువాని
[11]
కాకుస్థు
[12]
మనుపు
[14]
వాడవారు
[15]
లక్ష్మి తమకు తానె లభ్యమౌనని కాదె
[16]
సుఖముఁ గోర ధనము సౌభాగ్యమును గోరు
[17]
పసిడికంటె తీపి పరఁగెడునొ లేదొ
[18]
తెలుపబడ్డవాడు
[19]
మాట లేనివాడు
[20]
మేలువారిఁ నమ్మి