వేమన పద్యాలు – సంస్కృతానువాదము
2. దాంభికపద్ధతిః
అచ్చువేసికొన్న నడియేని యన్నను
తమ్మఁదిన్న పంగ దాసుఁడ నన
భాగ్యవశత గాని బ్రదుకులు లేవయా
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.1
గురూచ్ఛిష్టాశనాత్ తప్తముద్రయా
దాసభావతః ।
న లాభః
స్యాద్వఞ్చకానాం, భాగ్యం సర్వత్ర కారణమ్ ॥
అందు నిందు వెదకి యనుభవ మందక
కొందఱయ్య లెపుడు కొంగవలెను
మూర్ఖ తపముఁ బూని మురియుట గానవా
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.2
జ్ఞాతుం హరిం బహూన్ దేశానటిత్వా
నిష్ప్రయోజనాః ।
కపటే తపసి
స్థిత్వా నశ్యన్తి బకవద్ వృథా ॥
అధిక మైన యజ్ఞ మల్పుండు తాఁ జేసి
మొనసి శాస్త్రములని మురువు దక్కు
దొబ్బ నేర్చుకుక్క దుత్తలు మోచునా?
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.3
ధనార్థం యజ్ఞకృన్నీచో వేదద్విట్ న
గుణీ భవేత్ ।
శీర్ణాన్నభక్షకః
శ్వా తు న రక్షేదన్నభాజనమ్ ॥
అన్నమదమువలన నతివలు మతిచెడి
యేపు రేఁగి మదనుఁ డేఁచె నందు
రన్నముడుగు వెనుక నతఁ డెందుఁబోయెరా?
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.4
అన్నేన నార్యః కామార్తా భవన్తీతి
వచో వృథా ।
నిరాహారాం చ
రమణీం మదనో న విముఞ్చతి ॥
అన్నిజాతులందు నధికుల మనుచును
యజ్ఞపశువుఁ జంపి యగ్ని నిడుచు
మల్లయందుఁ బెట్టి మాంసంబు తిందురు
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.5
కులీనా వయమిత్యుక్త్వా హత్వా
యజ్ఞపశుం నరాః ।
నిధాయ మాంసం
కుణ్డేషు భక్షయన్తి హి భూసురాః ॥
అరయ దోఁచికొనుచు గురు వని తన్నెంచి
తిరుగువాఁడు తన్ను నరయ లేఁడు
పనికి మాలినట్టి బానిసకొడుకురా
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.6
ఆత్మజ్ఞానవిహీనా యే గురుస్థానం చ
సంశ్రితాః ।
పరస్వం
వఞ్జయన్తస్తే వర్తన్తే గర్హితా జనైః ॥
అఱుత లింగముండ నది యెఱుంగఁగ లేక
పర్వతంబుఁ బోవు బానిసీఁడు
ముక్తిఁగాననగునె మూడాత్ముఁ డగుఁగాక[1]
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.7
లిఙ్గం కణ్ఠధృతం త్యక్త్వా తదర్థం
పర్వతాదికమ్ ।
ప్రయాన్తి శైవా
మూఢాస్తే తేన మోక్షో న లభ్యతే ॥
అల్ల బోడితలలు తెల్లనిగొంగళ్ళు
నొడలబూతి పూసి యుందు రెపుడు
ఇట్టి వేషము లిల బొట్టకూటికె సుమా
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.8
కమ్బలేన విభూత్యా చ
ముణ్డనేనాప్యలఙ్కృతాః ।
ప్రతార్య
భిక్షువేషేణ కుక్షిం బిభ్రతి మానవాః ॥
అక్షమాలఁ బూని యలసటఁ జెందక
కుక్షి నింపుకొనుట కొదువ గాదు
పక్షికొంగరీతి పైచూపు లేలొకో
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.9
రుద్రాక్షమాలావేషేణ హానిర్నాస్తి
పరస్య తు ।
అథాపి
వఞ్చనావృత్తిః క్రియతే బకవత్కుతః ॥
అక్షరాళివెంట నడవుల వెంటను
కొంగరాలఁ గోడు గుడవ నేల
హృదయమందు శివుఁడటుండుట తెలియదా
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.10
వనపర్వతభాగేషు భ్రమన్నఙ్గ ! జపే
రతః ।
కుతస్త్వం
ఖిద్యసే చిత్తే శివే వసతి సర్వదా ॥
అఁకటికి తొలంగు నాచారవిధు లెల్ల
చీకటికి తొలంగు చిత్తశుద్ధి
వేఁకటికి తొలంగు వెనుకటి బిగు వెల్ల
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.11
బుభుక్షాయాం సదాచారః
చిత్తశుద్ధిస్తథా నిశి ।
పటుత్వం
గర్భిణీదేహే సర్వమప్యపగచ్ఛతి ॥
ఆకులెల్ల దిన్న మేఁకపోతు కేల
కాకపోయె నయ్య కాయసిద్ధి
లోకు లెల్ల వెఱ్ఱిపోకళ్లఁ బోదురు
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.12
పర్ణాశనాత్ కాయసిద్ధిః యాది స్యాత్
పర్ణభక్షకః ।
కాయసిద్ధిమజో
విన్దేత్ ; వాదోఽయం నైవ యుజ్యతే ॥
ఆచరాచముల నంగాల లింగాలు
సరణి దెలియనట్టిశైవ మేల
అష్టతనుమయుండు హరుఁడౌట తెలియదు
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.13
సాడమ్బరం లిఙ్గమాత్రం శైవా దేహే
ధరన్త్యమీ ।
శమ్భురష్టతనుశ్చేతి
మతం నైవ విదన్తి తే ॥
ఆఁడుదానిఁ జూడ నర్థంబుఁ జూడఁగ
బ్రహ్మకైనఁ బుట్టు రిమ్మ తెగులు
బ్రహ్మయాలిత్రాఁడు బండి రేవునఁ ద్రెంబ
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.14
దృష్ట్వా స్త్రియం ధనం చైవ సర్వో
భవతి మోహితః ।
వాణీం సృజన్
బ్రహ్మదేవః ముమోహ కిల తాం ప్రతి ॥|
ఆత్మశుద్ధిలేని యాచార మదియేల
భాండశుద్ధిలేని పాక మేల
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.15
భాణ్డశుద్ధిం వినా పాకః
చిత్తశుద్ధిం వినార్చనామ్ ।
వినాత్మశుద్ధిమాచారో
వ్యర్థా ఏవ మతా భువి ॥
ఆఱు మతములందు నధికమైన మతంబు
లింగ మతముకన్న లేదు భువిని
లింగధార్లకన్న దొంగలు లేరయా?
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.16
షణ్మతేషూత్తమం శైవమతమిత్యుచ్యతే
జనైః ।
తత్సత్యం, కిన్త్విమే
శైవాశ్చోరాణామగ్రగామినః ॥
ఆసనములు పన్ని యంగంబు బిగియించి
యొడలు విఱిచికొనెడియోగు లెల్ల
జెట్టిసాముకన్న చింతాకు తక్కువ
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.17
యోగాసనైః స్వదేహస్య వృథా బాధాకరా
ఇమే ।
యోగినో
మల్లవీరేభ్యః కిఞ్చిన్న్యూనాః ప్రకీర్తితాః ॥
ఇచ్చవచ్చు నరుని కెచ్చువైష్ణవ మిచ్చి
ద్విజులకన్న దొడ్డతీ రటంచు
నెల్లవారు నల్లపిల్లాండు పాడరా?
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.18
పఞ్చమాన్ వైష్ణవాన్ కృత్వా
వర్ణసాఙ్కర్యకారకాః ।
మిలితాస్తైశ్చ
‘పల్లాణ్డుం’ గాయన్తి కిల వైష్ణవాః॥
ఇల్లు నాలి విడిచి యినుపకచ్చలఁ గట్టి
వంటకంబు నీటివాంఛ లుడిగి
ఒంటినున్న యంత నొదవునా తత్త్వంబు?
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.19
విహాయ భార్యాం కౌపీనం బద్ధ్వాఽన్నజలవర్జితః ।
ఏకాన్తే
వర్తమానోఽపి తత్త్వం నో వేత్తి మానవః ॥
ఇహమునందు సుఖము లీడేరఁగా లేదు
పరమునందు నెట్లుపడయవచ్చు
మొదల లేనిచేఁత తుది ఎట్లువచ్చురా?
విశ్వదాభిరామ వినుర
వేమ. 2.20
ఇహాలబ్ధసుఖః పశ్చాత్ కథం
ప్రాప్స్యతి తన్నరః ।
లోకాదౌ యన్న
లభ్యేత లోకాన్తే తత్కథం భవేత్ ॥
ఉదయమందు శూద్రుఁడు త్తమోత్తముఁ డెట్లు
సతికి శూద్రతనము సత్యమెకద!
తల్లి శూద్రయయ్యె తానెట్లు బాఁపడు?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.21
స్త్రీణాం తు నోపనయనం తదభావన్న
విప్రతా ।
శూద్రాసు తాసు
జాతానాం ద్విజత్వం జాయతే కథమ్ ॥
ఉపవసించుచుండి యొగి నీళ్ళ మునిఁగియు
కూడువండి వేల్పుఁ గుడువు మనుచు
దాని నోరుకట్టి తామె తిందురు కదా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.22
యోగీ నిరశనః స్నాతః పక్త్వాఽన్నం దేవసన్నిధౌ ।
‘స్వీకురుష్వే’తి కథయన్ సర్వం భక్షయతి స్వయమ్ ॥
ఉపవసించినంత నూఱబందిగఁ బుట్టు
తపసియై దరిద్రతను వహించు
శిలకు మ్రొక్కనగునె జీవము గలబొమ్మ?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.23
ఉపవాసాత్ వరాహః స్యాత్ తపసా స్యాత్
దరిద్రతా ।
నిర్జీవాం
ప్రతిమాం మర్త్యః సజీవో వన్దతే కుతః ॥
ఊరఁబం దెఱుంగ దుత్తరావాచులు
చెడ్డనరక మెల్లఁ జెందుఁ గాక
సాధ్విమహిమమెట్టు స్వైరిణి యెఱుఁగురా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.24
మలభుక్ సూకరః శ్రేష్ఠం వస్తు నో
వేత్తి వై యథా ।
సాధ్వీప్రభావం
కులటా మహాన్తం వఞ్చకస్తథా ॥
ఊరినడిమి బావియుదకంబు గొనితెచ్చి
పాదతీర్థ మనుచు బ్రమయఁ జేతు
పాదతీర్థ మన్న ఫలమేమి కద్దురా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.25
గ్రామమధ్యస్థకూపాత్తం జలం
తీర్థోదకం త్వితి ।
ఉక్త్వా జనాన్
పాయయన్తి మూర్ఖాస్తన్న ఫలప్రదమ్ ॥
ఊరులు పల్లెలు మానుక
వారక యడివిం జరించవాఁ డరుదెంచు
వేరులుఁ గూరలు మెసవెడు
వీఱిఁడి కెట మోక్షపదవి
వినఁగా వేమా! 2.26
గ్రామం విహాయ విపినే కన్దమూలాశనేన
చ ।
అజ్ఞానాం
మోక్షపదవీ కథం లభ్యేత భూతలే ॥
ఎంగిలెంగి లనుచు నీనోటితోడనే
వేదములను జదువు వెఱ్ఱులార
యెంచి చూడ నదియు నెంగిలికాదొకో?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.27
ఆస్యసమ్బద్ధముచ్ఛిష్టమితి విప్రాః
ప్రచక్షతే ।
తథాచేదాస్యసమ్బద్ధో
వేదోప్యుచ్ఛిష్టతాం వ్రజేత్ ॥
ఎంబెరుమత మని యెసఁగి మాంసముఁ దిని
మారుపేర్లు పెట్టి మధువు ద్రావి
వావివరుస దప్పి వర్తించి చెడుదురు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.28
సురాం పీయూషమాఖ్యాయ పీత్వా, మాంసం నిషేవ్య
చ ।
బాన్ధవ్యమప్యనాలోచ్య
స్త్రియమిచ్ఛన్తి వైష్ణవాః ॥
ఏమియైనది పరతత్త్వ మెఱుఁగ లేక
సోమయాజులు పశువుల స్రుక్కడంచి
సామమేర్పడఁ జదివినఁ జావ వేల
బాధకము లగు దుర్గుణపంక్తి
వేమ. 2.29
యాజకాః సామగానేన యాగేషు పశుహింసకాః
।
పాపేభ్యో న హి
ముచ్యన్తే తత్త్వజ్ఞానవివర్జితాః ॥
ఐనదాని కింక కాని దానికి నైన
నాఁడువారిమాట లాడుమన్న
సాహసమున పెక్కు లూహలు పనుతురు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.30
సత్యేఽవిషక్తమనసః సతీనాం చరితే వృథా ।
కుయుక్తిభిశ్చ
కాలుష్యం కల్పయన్తి హి దాంభికాః ॥
ఒడల బూది పూసి జడలు ధరించిన
నొడయఁ డగును ముక్తిఁ బడయలేఁడు
తడకబిఱ్ఱు పెట్టఁ దలుపుతో సరియౌనె?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.31
నరో ముక్తిం న లభతే విభూత్యా
జటయాపి వా ।
దృఢో
వంశదలాచ్ఛాదః నైవ విన్దేత్కవాటతామ్ ॥
ఒడ్డుఁబొడుగుఁగలిగి గడ్డముం బొడవైన
దానగుణము లేక దాత యగునె
యెనుము గొప్పదైన నేనుఁగుఁ బోలునా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.32
మహాకాయో మహాశ్మశ్రురపి దానగుణీ న
చేత్ ।
న దాతా స్యాత్ ; దేహసామ్యాత్
మహిషో న హి వారణః ॥
కడుపు బోరగించి కన్నులు ముకుళించి
బిఱ్ఱబిగిసికొన్న బీదయోగి
యమునిబారిగొఱ్ఱె యతఁ డేమి సేయురా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.33
శుష్కోదరో మీలితాక్షో యోగివేషధరో
నరః ।
యమస్య
భక్ష్యతాం ప్రాప్తో న కిఞ్చిద్వేత్తి మేషవత్ ॥
కంబళములఁ గట్టి గంతల గజ్జల
బోడితలల సొంపు పొల్పు మీఱఁ
గడుపుకొఱకుఁ దిరుగ ఘనులౌదురా వారు?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.34
ముణ్డితాః కమ్బలేనాథ మణ్డితా
నూపురేణ చ ।
జీవికార్థమటన్తస్తే
శ్లాఘ్యా న స్యుర్మహీతలే ॥
కల్లటికెకు భూతి గట్టిగాఁ బెట్టిన
నందులోని కంపు లడఁగనట్టు
మెడను ద్రాడువేయ మెఱయుచు ద్విజుఁడౌనె?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.35
సురాపాత్రం న దుర్గన్ధం త్యజేత్
భూత్యాప్యలఙ్కృతమ్ ।
యజ్ఞోపవీతమాత్రేణ
నరః కిం జాయతే ద్విజః ॥
కావిపంచగట్టి కడుయోగివలె నుండి
వెలికిఁ గోర్కు లెల్ల విడిచిపెట్టి
తొరగి తిరుగువాఁడు దొంగసన్న్యాసిరా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.36
స వై కపటసన్న్యాసీ నటేద్యస్తు
నిరాశవత్ ।
కాషాయధారీ
యోగీవ మహీమటతి సర్వదా ॥
కుక్కుటమననంబు కొక్కెరధ్యానంబు
యతులనొసట నొనరునట్లు వ్రాసెఁ
దొల్లి చేసినట్టి దోషంబు తగిలెనో?
విశ్వదాభిరామ వినుర వేమ.
బకకుక్కుటవత్ ధ్యానం మననం
క్రియతామితి ।
విధిః
కపటసన్న్యాసిలలాటే వ్యలిఖత్కిము ॥
కులము నీఱుచేసి గురువును వధియింప
బొసఁగ నేనుఁ గంతబొంకు బొంకె
పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.38
కులహన్తా గురుఘ్నశ్చ మిథ్యావాదీ
గజచ్ఛలాత్ ।
నామ్నా పరం
ధర్మరాజో విషబీజసమో హి సః ॥
గుహలు పదివేలు సొచ్చిన గుణము పోదు
నియతగురుభక్తి కావలె నేర్పుమీఱ
మహితపరతత్త్వ భావంబు మధుర మగును
దాని సాధింపనే మఱి పూను
వేమ. 2.39
గుహాం ప్రాప్య గుణీ న స్యాత్
జ్ఞానం యద్గురుభక్తితః ।
తద్దర్శయేత్పరం
బ్రహ్మ తస్మాత్ జ్ఞానముపార్జయ ॥
గూబవలె గ్రుడ్లుద్రిప్పిన గుణము రాదు
లోభమోహము లుడుగంగ లాభమగును
దేబెలై భిక్ష మెత్తుట తీర్ప దెపుడు
డాబుచేసిన లక్ష్యమడంగు
వేమ. 2.40
ఉలూకవన్నేత్రవృత్యా భైక్షాద్వా న
గుణీ భవేత్ ।
త్యక్తాజ్ఞానః
ఫలం విన్దేత్ దమ్భాల్లక్ష్యం వినశ్యతి ॥
ఘటము నింద్రియములఁ గట్టివేయగ లేక
చావువచ్చునప్పుడు సంన్యసించు
నాత్మశుద్ధి లేక యందునా మోక్షంబు?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.41
అజితేన్ద్రియదేహస్య మృత్యుకాలే
సమాగతే ।
సన్న్యాసేనాపి
నో ముక్తిరాత్మజ్ఞానం న చేద్భవేత్ ॥
చిలుక నోరుగట్టి చిత్తజు మెడఁగట్టి
కచ్చడంబు బిగియఁ గట్టికొన్న
మనసువశముగాదె! మహి నేమి పాపము?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.42
మారకణ్ఠ ప్రమర్దేన శుకవాక్యస్య
బన్ధనాత్ ।
కచ్ఛశుద్ధయాపి
చిత్తం న వశే స్యాత్కిన్ను కారణమ్ ॥
చక్కనిసతి యైన సరసురా లైనను
మే నొరులను గాన నీయకున్న
సందె గ్రుంకినంత సయ్యాటలాడదా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.43
వస్త్రవేష్టితసర్వాఙ్గా తరుణీ
రసికాపి చ ।
భార్యా నిశాయామితరై
రన్తుం యాతి గృహాద్బహిః ॥
చదువు చదువనేల సన్యాసి కా నేల
షణ్మతములఁ జిక్కి చావ నేల
అతని భజనఁజేసి యాత్మలోఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినుర వేమ. 2.44
వృథా శాస్త్రాదిపఠనం
సన్న్యాసగ్రహణం వృథా ।
వృథా
శాస్త్రవిచారోఽపి హృద్గతం బ్రహ్మ భావయ ॥
చాలదయ్య యింక చార్వాకమతరీతి
శక్తి శైవ మనుచుఁ జాల నమ్మి
సరణి మిగిలి చెడును చండాలసేవచే
విశ్వదాభిరామ వినుర వేమ. 2.45
న చార్వాకమతం శ్రేష్ఠం శ్లాఘ్యం
శైవమతం త్వితి ।
జల్పన్తో
నీచమాశ్రిత్య మూఢా జీవన్తి భూరిశః ॥
జడలు గట్టనేల సన్యాసి కానేల
నొడలు విఱచుకొనెడి యోగ మేల
ముక్తికాంతఁ బట్టి ముద్దాడనే కదా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.46
ముక్తికాన్తాపరిష్వఙ్గవాఞ్ఛయా బహవో
జనాః ।
సన్న్యాసిత్వం
జటాభారం యోగం చాపి భజన్త్యమీ ॥
జాతులందు మిగుల జాతి యే దెక్కువో
యెఱుక లేక తిరుగ నేమి ఫలమొ
యెఱుకగలుగువాఁడె యెచ్చైనకులజుండు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.47
జాతీనాముత్తమా జాతిః కేతి జానన్తి
నో జనాః ।
త ఏవ జాతిషు
శ్రేష్ఠా జ్ఞానవన్తో భవన్తి యే ॥
టిప్పణములు సేసి చప్పనిమాటలఁ
జెప్పుచుందు రన్ని శ్రుతులు స్మృతులు
విప్పి చెప్ప రేల వేదాంత సారంబు?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.48
శ్రుతిస్మృత్యోరపవ్యాఖ్యాం విరసాం
స్వేచ్ఛయా జడాః ।
కృత్వా వదన్తి; వేదాన్తసారం
నోపదిశన్తి తే ॥
ఠింగణాలు బలసి నింగికి నెగిరినఁ
జెట్టుచివరపండు చేతఁ బడునె
పుస్తకములు చదువఁ బొందునా మోక్షముల్
విశ్వదాభిరామ వినుర వేమ. 2.49
వృక్షాగ్రస్థం ఫలం
కుబ్జోదివముత్ప్లుత్య నాప్నుయాత్ ।
గ్రన్థానాం
పఠనాదేవ నరో ముక్తిం న విన్దతి ॥
డగ్గఱకుము పాపదాంభికులను నీవు
మోసపుత్తురయ్య దోసమనక
క్రూరమృగములట్టివారు రానమ్మకు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.50
త్యజ క్రూరమృగై స్తుల్యాన్
దామ్భికాన్ పాపనిశ్చయాన్ ।
నూనం తే
వఞ్చయేయుస్త్వాం పాపం తైర్న హి గణ్యతే ॥
తంత్రమంత్రములను తారకమబ్బునా
యంత్రబలము గురునిమంత్ర మూని
చింతఁ జేయునపుడె చిన్మయ మందురా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.51
తారకం తన్త్రమన్త్రాభ్యాం న
సిద్ధయేత్ , కిన్తు యన్త్రణమ్ ।
గురుమన్త్రయుతం
చిత్తే ధ్రియతాం బ్రహ్మ తే ధ్రువమ్ ॥
తనువునందు నగ్ని దఱికొని కాలంగఁ
గాల్చుకొనుట యేమికర్మమునకొ
కాల్చుకొన్న యంత ఘనుఁడు తానయ్యెనా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.52
శరీరాన్తః స్థితే వహ్నౌ శుద్ధ్యర్థం
బాహుమూలయోః ।
తప్తచక్రాఙ్కధరణం
వ్యర్థం తన్న ఫలప్రదమ్ ॥
తనువు లస్థిర మని ధనము లస్థిర మని
తెలుపఁగలఁడు తాను తెలియలేఁడు
చెప్పవచ్చుఁ బనులు సేయుటకష్టమౌ
విశ్వదాభిరామ వినుర వేమ. 2.53
శరీరమస్థిరం విత్తమితి వక్తి న
వేత్తి చ ।
సమర్థాః కథనే
సర్వే న తు కార్యస్య సాధనే ॥
తప్పువేషమూని ధరలోనఁ దిరిగెడు
సేఁతలెల్ల మిత్తిఁ జేరుటకునె
కడుపునిండ నింత కష్టంబు లేలరా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.54
వేషధారీ జీవికార్థం కృత్వా
దుష్కర్మ చాన్తతః ।
యాతి కాలవశం
దేహభరణార్థం కుతః శ్రమః ॥
తిరుపతికిని బోవఁ దుఱక దాసరి గాఁడు
కాశికేఁగఁ బంది గజము గాదు
కుక్క సింహ మగునె గోదావరికిఁ బోవ?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.55
నదీస్నానాత్ శ్వా న సింహః కాశీం
ప్రాప్య న సూకరః ।
గజః స్యాత్, యవనో దాసో న
స్యాత్ తిరుపతిం గతః ॥
తోలుకడుపులోన దొడ్డవాఁ డుండఁగ
రాతిగుళ్ళ నేల రాశిఁ బోయ
రాయి దేవుఁడైన రాసులు మ్రింగదా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.56
దేవే హృది స్థితే చాన్నం శిలాయై
దీయతే కుతః ।
శిలాయాం యది
దేవః స్యాత్ అన్నరాశిం గ్రసేన్న కిమ్ ॥
దేశదేశములను తిరుగంగ తిరుగంగ
నాత్మయందు ధ్యాన మంటుకొనునె?
కాసులకును తిరుగఁ గల్గునా మోక్షంబు?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.57
దేశసఞ్చారమాత్రేణ హ్యాత్మధ్యానం న
సేత్స్యతి ।
ధనార్థమటతాం
తేషాం మోక్షవార్తా విదూరతః ॥
దొంగమంత్రములను దొరకునా మోక్షంబు
చేతఁగాని చేఁత చెల్ల దెపుడు
గురువటండ్రె వాని గుణహీనుఁ డనవలె
విశ్వదాభిరామ వినుర వేమ. 2.58
ముక్తిర్న స్యాత్ దుష్టమన్త్రాత్
దుఃసాధం కర్మ మా కురు ।
దుష్టమన్త్రప్రదో
నైవ గురుః స్యాత్ కిన్తు వఞ్చకః ॥
ద్వాదశతిరుమణులు దగునట్టు ధరియించి
ద్రవిడగ్రంథములను దనరఁ జదివి
అక్షయమగు పాత్ర నమరంగఁ దాల్తురు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.59
ధృత్వా ద్వాదశ పుణ్డ్రాణి పఠన్తో
ద్రావిడశ్రుతిమ్ ।
చరన్తి భైక్షం
రథ్యాసు విరక్తా ఇవ వైష్ణవాః ॥
నీళ్ళ మునుఁగ నేల నిధులఁ బెట్టఁగ నేల
మొనసి వేల్పులకును మ్రొక్క నేల
కపటకల్మషములు కడుపులోనుండఁగా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.60
తీర్థస్నానం వృథా ధర్మకార్యార్థం
నిధికల్పనమ్ ।
దేవతాప్రార్థనం
వ్యర్థముదరే పాపపూరితే ॥
పట్టుబట్టఁగట్టి పట్టెనామముఁ బెట్టి
వట్టిభ్రాంతిఁ జెంది వైష్ణవుఁ డయి
లొట్టిదాగినతఁడు లోకులఁజెఱుచురా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.61
ఊర్ధ్వపుణ్డ్రధరాః క్షౌమవాససో
వైష్ణవా భువి ।
సురాపానరతా
భ్రాన్తాః నాశయన్తి జనాన్ సతః ॥
పరఁగ ప్రతిమలకును ప్రాణప్రతిష్ఠలో!
ప్రాణ మొసఁగ ప్రతిమ పలుకవలదె
మొదటివానిసృష్టి మూర్తిమంతంబైన
విశ్వదాభిరామ వినుర వేమ. 2.62
న శిలావిగ్రహే ప్రాణప్రతిష్ఠా
యుజ్యతే, యతః ।
న భాషతే శిలా, చాదిపురుషో న
హి మూర్తిమాన్ ॥
పరమయోగుల మని పరముఁ జేరఁగ లేని
మాయజనుల కెట్లు మంచి కలుగు
వేసములను విడచి విహరింప ముక్తియౌ
విశ్వదాభిరామ వినుర వేమ. 2.63
యోగీతి కథయన్ తత్త్వజ్ఞానశూన్యో హి
వఞ్చకః ।
ఫలం న లభతే, వేషస్త్యజ్యతాం
ముక్తికాంక్షిణా ॥
పరుల మోసపుచ్చి పరధన మార్జించి
కడుపు నించుకొనుట కానిపద్దు
ఋణముసేయ మనుజుఁడెక్కువ కెక్కునా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.64
పరప్రతారణోపాత్తధనాత్ కుక్షిమ్భరా
జనాః |
అధమర్ణాస్తతో
నీచా ఋణకర్తా కథం మహాన్ ॥
పరుల మోసపుచ్చి పరధన మార్జించి
కడుపు నించుకొనుట కానిపద్దు
ఋణముసేయ మనుజుఁడెక్కువ కెక్కునా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.65
కాకాన్ పితృసమాన్ మత్వా తేభ్యః
పిణ్డం చ పర్వసు ।
యచ్ఛన్తి
మలభుక్ కాకః కథం స్యాత్ పితృదేవతా ॥
పేరుసోమయాజి పెనుసింహబలుఁ డాయె
మేఁకపోతుఁ బట్టి మెడను విఱువఁ
గాక క్రతువువలనఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.66
యజ్వా యాగపశోః కణ్ఠమర్దనే
సింహవిక్రమః ।
కథం హింసాపరో
యజ్ఞకర్మణా మోక్షమాప్నుయాత్ ॥
బందె త్రాళ్ళఁ దెచ్చి బంధించి కట్టంగ
లింగఁడేమి దొంగిలించినాఁడొ
ఆత్మలింగమునకు నర్చింపనేరరో
విశ్వదాభిరామ వినుర వేమ. 2.67
ఆత్మలిఙ్గమనారాధ్య లిఙ్గం బధ్వా చ
తన్తుభిః ।
ధరన్తి శైవాః
కణ్ఠే చ చౌర్యం లిఙ్గేన కిం కృతమ్ ॥
బ్రాహ్మణులమటండ్రు బ్రహ్మత్వ మదిలేని
బొమ్మవలెను దాను దిమ్మఁపైఁ గూర్చుండ
విశ్వదాభిరామ వినుర వేమ. 2.68
బ్రాహ్మణో బ్రహ్మవిద్యావాన్
బ్రాహ్మణ్యం తద్వినా కుతః ।
ప్రతిమావత్
స్థితోఽలిన్దే విప్రో లోకైర్న పూజ్యతే ॥
భాగవతుల మనుచుఁ బరగంగ నెవ్వరు
వారి నెఱుఁగ లేరు వరుసతోడ
ఆడిపాడువార లరయ భాగవతులా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.69
భక్తిం వినా నృత్తగీతకరాన్ భాగవతా
ఇతి |
మూఢా వదన్తి; తన్నైవ భక్తో
భాగవతః స్మృతః ॥
భూతి దేహమందుఁ బూసిన నయ్యెనా
నిష్ఠ శివునియందు నిలుపవలయుఁ
గాక బూడ్డెయందు గాడిద పొరలదా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.70
న భస్మధరణాన్ముక్తిః శివే కురు సదా
మనః ।
యద్యేవం భస్మని
లుఠన్ వరాహో ముక్తిమాప్నుయాత్ ॥
భూతిపూసి నీవు ప్రాతభూతంబుల
వెడలఁ గొట్టఁబోవ వెఱ్ఱి వనుచు
నిన్నె కాంచి భీతి నిలువక పారరో
విశ్వదాభిరామ వినుర వేమ. 2.71
విభూతిధారిణం భూతముచ్చాటయితుమాగతమ్
।
దృష్ట్వా పిశాచ
ఏవాయమితి ధావన్తి మానవాః ॥
మతపు వేషధార్లు మహిమీఁదఁ బదివేలు
మూఢజునలఁ గలప మూగుచుంద్రు
కొంగలు గుమిగూడి కొఱకవా బోదెలు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.72
మతవేషధరా లోకే సహస్రాదధికాన్ జనాన్
।
భ్రష్టాన్
కృత్వా నాశయన్తి ధాన్యరాశిం యథా బకాః ॥
మనసున దయలేని మాలకొడుకునొద్దఁ
జేరియున్న ప్రజకు చేటు నిజము
పెద్దతనము లెంచఁ బెంకెల చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ. 2.73
చణ్డాలం నిర్దయం వేషధారిణం ప్రాప్య
మానవాః ।
క్లిశ్యన్తే
హన్త మూర్ఖాణాం పటాటోపో విపత్కరః ॥
మాల మేలు గుణము మంచిది కలిగిన
మాలకూడుఁ గుడుచు మనుజుకంటె
గుణమె మేలుకాని కుల మేమి మేలురా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.74
పఞ్చమోఽపి గుణీ శ్రేష్ఠః; నిషిద్ధాహారతత్పరః ।
కులీనోప్యుత్తమో
న స్యాత్; గుణః శ్రేష్ఠో న వై కులమ్ ॥
ముక్కు కన్నులు చెవు లంటి మూయనేల
తెలిపు తెరగంటిలోపలఁ దేటపఱచి
తిరుగ నేర్చినవాఁడె పో ధీజితుండు
ఊరకయ మూయ డంబంబు లోరి
వేమ. 2.75
స వై జితేన్ద్రియో యస్తు చిత్తం
దేవే నివేశయేత్ |
శ్రోత్రనేత్రనిరోధేన
న ఫలమ్ ; దమ్భకర్మ తత్ ॥
ముద్రలన్న నేమొ మురిసెద రయ్యయో
భద్రముగను మనసు పరగకున్న
వెఱ్ఱి చేష్టలగును వివరింప ముద్రలు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.76
కిమర్థం యోగముద్రాసు భ్రమః, తత్త్వవిమర్శనే
।
మనోనిరోధో
ముద్రా స్యాత్ అన్యన్మూర్ఖస్య చేష్టితమ్ ॥
మొనసి యింద్రియముల మొదట నిల్పఁగ లేక
సమసిపోవు వేళ సన్న్యసింత్రు
ఆత్మశుద్ధి లేక యంటునా మోక్షంబు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.77
అసంమృశ్యేన్ద్రియాణ్యాదావాపత్సన్న్యాససేవయా
।
ముక్తిర్న
స్యాదాత్మశుద్ధిః కారణం కిల ముక్తయే ॥
మోసమునను దనకు మొదటిముఖ్యత హాని
మోసమునను తనదు మురువు దప్పు
మోసమునను తనదు మోక్షము తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.78
వఞ్చకో నాప్నుయాత్కీర్తిం తుష్టిం
చాపి న విన్దతి |
ముక్తిర్న
స్యాద్వఞ్చకస్య వఞ్చనా సర్వనాశినీ ॥
మ్రుచ్చు గుడికి పోయి ముడివిప్పునేకాని
పొసఁగ స్వామిఁ జూడఁ బోఁ డతండు
కుక్క యిల్లు సొచ్చి కుండలు వెతకదా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.79
శ్వా యథా ప్రవిశేద్గేహమన్నాన్వేషీ
న రక్షకః ।
తథా చోరోఽపి చౌర్యార్థమాలయం న తు భక్తితః ॥
యజ్ఞయాగము లని యన్ని చేసినఁ గాని
ఆత్మయజ్ఞ మగునె యంటిచూడ
క్రతువు చేయువారు కానంగ దొంగలు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.80
విచార్యమాణే యజ్ఞేభ్యోఽప్యాత్మయజ్ఞో వరో మతః ।
ధనార్థం
యజ్ఞకర్తారః సర్వే తే వఞ్చకాః స్మృతాః ॥
రాతిబొమ్మ కేల రంగైనవలువలు
గుళ్ళుగోపురములుఁ గుంభములును
కూడుగుడ్డ తాను గోరునా దేవుఁడు?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.81
న శిలావిగ్రహో వస్త్రమన్నం వాపి
ప్రతీక్షతే ।
వస్త్రగోపురకుమ్భాద్యాః
కల్ప్యన్తే కేన హేతునా ॥
రాయి యయ్యె దేవరాయఁడు భువిలోన
భక్తి మ్రొక్కువారు బండలె కద
దేవునంతవారు భావింప భక్తులా?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.82
దేవదేవే శిలారూపే యో భక్తః శిలాసమః
।
హరివేషశిలాభక్తాః
న భక్తాః స్యుః శిలామయాః ॥
రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించు
భ్రష్టుత్రోవ నరుగు భ్రష్టజనుఁడు
ఱంకునకును తిరుగురమణులవలెనుండ్రు[3]
విశ్వదాభిరామ వినుర వేమ. 2.83
శివమేవ వినిన్దన్తో వఞ్చకాః
శివరూపిణః ।
జనాన్
ప్రతారయన్తీహ భక్తవేషో విటో యథా ॥
లోనఁ బదిలపఱచి లోవికారంబెల్లఁ
దరుగకున్న వాఁడు తపసికాఁడు
వెలివికార మెల్ల విధిపాలికోర్కులే?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.84
నిగూహ్యాన్తర్వికారాన్ యో
నిర్వికారో భవేద్బహిః ।
న స యోగీ ; బహిర్నూనం
నిర్యాన్తి కిల తే క్రమాత్ ॥
వడుగు ద్విజుల కెల్లఁ గడుముఖ్య మందురు
వడుగుఁ జేసెద మని వదరుచుంద్రు
కడుగుఁ ద్రావి కాకి కఱ్ఱుకఱ్ఱన్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.85
అత్రోపనయనం ముఖ్యం విప్రాణామితి
వఞ్చకాః ।
అజ్ఞాతశాస్త్రసారాశ్చ
కాకా ఇవ రటన్తి హి ॥
వంతు లింగమునను వరుస బూడిదెఁ బూసె
అంతరంగ మెఱుఁగ నంత్యజాతి
సంతబసివికొడుకు జంగముదేవరా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.86
విభూతిధారణాత్ శైవమాత్మానం వక్తి
పఞ్చమః ।
నరో నీచో
వరిష్ఠః స్యాత్ కథం ‘జఙ్గమ’ వేషతః ॥
విన్న సుద్ది కొంత విననిసుద్దులు కొన్ని
వింతసుద్దు లెన్నొ వినఁగఁ జెప్ప
దాను గన్న యట్టె దాంభికుఁ డెప్పుడు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.87
“శ్రుతిసిద్ధం
మయా దృష్టమి”తి కాల్పనికైర్భువి |
సదసద్విషయైర్లోకం
వఞ్చయన్తి హి దామ్భికాః ॥
విప్రవరుల మనుచు వేదంబు చదువక
ప్రాకృతులను జూచి పరిహసించు
ధరణిసురులకన్న దాసరిమత మెచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.88
అకృత్వా వేదపఠనం మత్వా
చాత్మానముత్తమమ్ ।
హసతః పామరాన్
దృష్ట్వా విప్రాత్ “దాసరయో” వరాః ॥
పొడుగుగల్గుజడలు[4] పులితోలు భూతియు
కక్షపాలలు పదిలక్షలైన
మోఁతచేటె కాని మోక్షంబు లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.89
వ్యాఘ్రచర్మజటాభూతి యోగదణ్డాది
ధారణాత్ ।
న మోక్షో
భారమాత్రం తత్ యది భక్తిర్న విద్యతే ॥
వెఱ్ఱిబట్టు వాని వినయము లధికముల్
చెడ్డముండముసుఁగు చెలఁగుచుండు
చెడిపెకొడుకు మిగులఁ జేయునాచారంబు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.90
వినయో వన్దిషు మహాన్ వేశ్యాయా
మావృతి స్తథా ।
ఆచారః
కులటాసూనౌ అతివేషో హి దామ్భికే ॥
వేనవేలు చేరి వెఱ్ఱికుక్కలవలె
అర్థహీనవేద మఱచుచుంద్రు
కంఠశోషకంటె కలిగెడి ఫల మేమి?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.91
వేదపారాయణమితి శునా తుల్యం
నిరర్థకమ్ ।
భషన్తి
శబ్దముచ్చార్య వ్యర్థం తత్ కణ్ఠశోషణమ్ ॥
వైశ్యుల మని యెడి వార్తమాత్రమె కాని
దొంగలింతకంటె దొరకఁబోరు
నేలమీఁద వీరి నేర్పుల నేమందు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.92
ధార్మికా వయమేవేతి వైశ్యా లోకే
వదన్తి హి ।
తేషాం
వఞ్చకముఖ్యానాం సామర్థ్యం లోకవిశ్రుతమ్ ॥
శీలమనుచు నరుడు సిగ్గింతయును లేక
పరులసొమ్ము లెల్ల పరిహరించి
వేషభాషవలన మోసంబుఁ జేయును
విశ్వదాభిరామ వినుర వేమ. 2.93
మానవః శీలముద్ఘుష్య పరస్వమపహృత్య చ
।
నిర్లజ్జో
వేషభాషాభ్యాం ప్రతారయతి సజ్జనాన్ ॥
సకలతీర్థములను సకల యజ్ఞంబుల
తలలఁ గొరుగకున్న ఫలము గలదె
మంత్రజలముకంటె మంగలిజలమెచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ. 2.94
పుణ్యతీర్థేషు యజ్ఞేషు
ప్రాయశ్చిత్తమిషాన్నరాః ।
ముణ్డయన్తి ; క్షౌరజలాత్ న
పూతో జాయతే నరః ॥
సతులు జపతపములు సల్పఁగ సాగిన
బురుషు లేల నిఁకను బుడమిలోన
పాపమెంచవద్దు పట్టి శిక్షింపుఁడీ
విశ్వదాభిరామ వినుర వేమ. 2.95
వృథా జపస్తపః స్త్రీణామన్యథా
పురుషః కుతః ? ।
వినా పాపమతిం, బద్ధ్వా
శిక్షణీయా గృహే స్త్రియః ॥
సంధ్య వార్వనేమి జపము సేయఁగ నేమి
వేదశాస్త్రములను వెలయ నేమి
పరము గననివాఁడు బాపఁడు గాఁడురా
విశ్వదాభిరామ వినుర వేమ. 2.96
అధీతవేదశాస్త్రోపి కృతసన్ధ్యాజపోపి
వా ।
తత్త్వజ్ఞానవిహీనశ్చేత్
బ్రాహ్మణ్యం ప్రాప్నుయాత్ కథమ్ ॥
సోమయాజి ననుచు సొంపైనశాలువల్
మకరకుండలములు మనసు దీరఁ
దా ధరించు మనకుఁ దా నేమి లాభించు?
విశ్వదాభిరామ వినుర వేమ. 2.97
కుణ్డలాభ్యాం కమ్బలేన సోమయాజీ
విభూషితః ।
రాజతే భువి
వేషేణ ; తేన లోకస్య కిం ఫలమ్ ॥
హీనజాతివాని కెచ్చువైష్ణవ మిచ్చి
ద్విజుల కన్న దొడ్డ తీరటంద్రు
కల్లుకడవ గడిగి గంగ నించిన రీతి
విశ్వదాభిరామ వినుర వేమ. 2.98
నీచం చ వైష్ణవం కృత్వా విప్రవర్యం
వదన్తి తమ్ ।
గఙ్గాజలస్య
సమ్బన్ధాత్ శుద్ధో న స్యాత్ సురాఘటః ॥
హృదయము పదిలంబైనను
గుదికొను సన్యాసమునకుఁ గొమ్ములు గలవా
యిదె యెఱుఁగరు చదువరు లట
మది ముక్తికి నాస్పదంబు
మహిలో వేమా. 2.99
స్థిరచిత్తో జితధనః మోక్షం విన్దతి
భూతలే ।
సన్న్యాసే కో
విశేషోఽస్తి నేదం జానాతి ‘పణ్డితః’ ॥
--::--
No comments:
Post a Comment