వేమన పద్యాలు – సంస్కృతానువాదము
3. విద్వత్పద్ధతిః
అంది యందనట్టి యచలస్వరూపంబు
పొందపడఁగ బూని పొదలువాఁడు
చెంది మిన్నకుండుఁ జిన్మయాకారుఁడు
విశ్వదాభిరామ వినుర
వేమ. 3.1
వేద్యావేద్యమయం నిత్యం జ్ఞానం
ప్రాప్య ప్రశాన్తధీః ।
యః పశ్యతి పరం
స్వాస్మిన్ స విద్వానితి కీర్త్యతే ॥
అన్నమునకు నంట దయిన నాత్మకు నంటు
ఆత్మను బెనఁగొన్న యన్నమంటు
ఆత్మశుద్ధి యన్న మన్నశుద్ధియు నాత్మ
విశ్వదాభిరామ వినుర వేమ. 3.2
జ్ఞానమాత్మగతం శుద్ధం స
చాత్మాప్యన్నమాశ్రితః ।
శుచిత్వమశుచిత్వం
వా భవేదన్నేన చాత్మనః ॥
అరయ మూలమందు నర్థంబునందును
నిర్మలాత్మునందు నియతునందు
బయలునందు శ్రుతులభావంబు నొక్కటి
వెలయ శివునిఁ జూచు వేడ్క
వేమ. 3.3
మూలే బాహ్యే పరే వ్యోమ్ని
వేదాన్తేఽప్యేకరూపతః ।
జ్ఞానం యదస్తి
తత్ప్రాప్య బుధః శివపదం వ్రజేత్ ॥
అష్టతనువులకును నాదిమ మైనట్టి
యాదిశక్తి గూడి యభవుఁ డగును
భయము లేక యుండు బ్రహ్మజ్ఞుఁడగుయోగి
విశ్వదాభిరామ వినుర వేమ. 3.4
పూర్వమష్టతనుప్రాప్తేరాదిశక్త్యా
యుతః శివః ।
నిత్యః స్యాత్, య ఇదం వేత్తి
నిర్భయః స సుఖీ భవేత్ ॥
ఆత్మ తనలోన గమకించి యనుదినంబు
నిర్గుణాత్మార్చనముఁ జేసి నిత్య మమర
ప్రత్యగాత్మను లో నెంచి ప్రబలుయోగి
సచ్చిదానందపద మందు సతము
వేమ. 3.5
ఆత్మన్యేవ హరిం మత్వా సమభ్యర్చ్య చ
నిర్గుణమ్ ।
కృత్వా మనసి
యోగీన్ద్రశ్చిదానన్దమవాప్నుయాత్ ॥
ఆత్మలోని సొమ్ము నంజనమునఁ జూచి
యంటితిరుగునట్టి యతఁడు యోగి
పుంజు గూటనుండి ప్రొద్దెఱంగియె కూయు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.6
జ్ఞానాఞ్జనేన విబుధో హృద్గతం
బ్రహ్మ పశ్యతి ।
జ్ఞాతప్రభాతో
రౌత్యేవ పఞ్జరథోపి కుక్కుటః ॥
ఆర్యు లైన ఘనులు కార్యహీనులుగారు
శౌర్యధైర్యములను సంతరించి
పూర్ణభావ మమరఁ బొందుచు నుందురు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.7
బుధాః సఫలకర్మాణః
శౌర్యధైర్యసమన్వితాః ।
బ్రహ్మభావం గతా
నిత్యమమరత్వం భజన్తి తే ॥
ఇంటిలోని జ్యోతి యెంతయు వెలుగఁగాఁ
బొరుగువారి యగ్గి కరుగ దెపుడు
తాను దైవమాయె దైవముఁ గొలుచునా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.8
బుధో దేవత్వమాపన్నో దేవమన్యం న
కాఙ్క్షతి ।
యథా గృహే
జ్వలన్ దీపో నాన్యం దీపమపేక్షతే ॥
ఇసుక బొగ్గు రాయి యినుమును స్వర్ణంబు
కసవుపోచవలెను గనుచునుండి
పరమపదము గాంచు పరిణామమందున
విశ్వదాభిరామ వినుర వేమ. 3.9
అయఃస్వర్ణశిలాఙ్గారవాలుకాః
తృణవత్సదా ।
జానన్ విద్వాన్
క్రమేణాథ లభతే పరమం పదమ్ ॥
ఈది దాఁటఁగలఁడు నేసాగరంబైన
సాధువృత్తితోడ సమయమందు
పాదుకొనుచు మనసు పరిపూర్ణ మొందును
విశ్వదాభిరామ వినుర వేమ. 3.10
భవాబ్ధితరణే శక్తః సాధువృత్త్యా
యుతో బుధః ।
ఈశ్వరార్పితచిత్తః
సన్ పూర్ణత్వం విన్దతే క్రమాత్ ॥
ఈశ్వరునిఁ దలంప నేడు పాళ్ళుగఁ జేసి
తనదు మూర్తి నెల్ల ధారఁబోసి
నిత్యకర్మములను నిలుచురా నెఱయోగి
విశ్వదాభిరామ వినుర వేమ. 3.11
స్వప్రవేశాత్ సప్తతనుమీశం
కృత్వాష్టదేహినమ్ ।
ధ్యాయన్
కర్మాణి కుర్వంశ్చ యష్టా భవతి పణ్డితః ॥
ఉత్తమశివయోగి యూహించి మది మించి
సత్తమమునఁ బోరి సరకుగొనఁడు
పొత్తుమఱచియుండు పూర్ణ భావంబున
విశ్వదాభిరామ వినుర వేమ. 3.12
స్వబుద్ధ్యా సర్వమాలోచ్య
తమోగుణవివర్జితః ।
నిఃసఙ్గో
విబుధః పూర్ణబ్రహ్మభావం సమశ్నుతే ॥
ఉదర పోషణ కొఱకన్న నుబ్బరాదు
మదిని లోగుట్టు విడకయే మర్మమూను
సదయహృదయుండు శివయోగి శాశ్వతుండు
ఉపము సాధించి మించెడు
నిర్వి వేమ. 3.13
సంతృప్తో జీవికామాత్రాత్ మర్మజ్ఞో
దృఢమానసః |
సదయః శాశ్వతం
బ్రహ్మ లబ్ధ్వా జ్ఞానీ సమేధతే ॥
ఉద్ధరింప గలుగు నుత్తముండు కులంబు
మధ్యముండు దానిమాట గనఁడు
అధముఁడైన వాఁ డడంగించునొక్కట
విశ్వదాభిరామ వినుర వేమ. 3.14
ఉత్తమః స్వకులం రక్షేత్
మధ్యమస్త్తన్న చిన్తయేత్ ।
అధమః
క్షణమాత్రేణ కులం సర్వం వినాశయేత్ ॥
ఉప్పుఁ గప్పురంబునొక్క పోలికనుండు
చూడఁజూడ రుచులజాడ వేఱు
పురుషులందు పుణ్యపురుషులు వేఱయా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.15
కర్పూరే లవణే చైవ రూపమేకం రుచిః
పృథక్ ।
తథైవ
పుణ్యపురుషః పరస్మాత్ భిద్యతే ధియా ॥
ఊగియూగి లాగి యున్నది గనఁగోరు
సాగ లాగి పట్టు సాక్షిగాను
యోగమమర ముక్తినొందును ప్రాజ్ఞుఁడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.16
విమృశ్య తత్త్వజిజ్ఞాసుః
సాక్షీకృత్య జనార్దనమ్ ।
యోగమభ్యస్య
మోక్షార్థం యతతే పణ్డితాగ్రణీః ॥
ఊరు విడువకుండు నుత్తమశివయోగి
పోరి చూచు మదిని బూర్ణసుఖము
దారిలోని నక్క తలపెట్టఁ బోవునె
విశ్వదాభిరామ వినుర వేమ. 3.17
యోగీ జితేన్ద్రియో ముక్తిం
స్వగృహస్థోపి విన్దతి ।
కుతో వా భ్రమణం
తర్హి సృగాలో ముక్తిమాప్నుయాత్ ॥
ఎండయనక తిరుగు నిర వెఱంగినయోగి
నీడ నున్న దానిజాడవలెనె
ఎండనీడ లున్నె యెఱుకకుఁ జూడుఁడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.18
ఛాయాతపౌ సమౌ మత్వాఽప్యాతపే సఞ్చరన్ సుధీః ।
తం వేత్తి
ఛాయయా తుల్యం భేదోఽయం న తు ధీమతామ్ ॥
ఎందు నెఱుకవాని కిహపరములు లేవు
ప్రాణహాని లేదు ప్రళయమునను
బ్రళయకాలమైనఁ బరమాత్మఁ గలియును
విశ్వదాభిరామ వినుర వేమ. 3.19
ఐహికాముష్మికం దుఃఖం సుఖం వా
నాస్తి ధీమతామ్ ।
ప్రలయే
ప్రాణభీతిర్న పరస్మిన్ లీయతే యతః ॥
ఏమహాత్మునందు నిజ్జగములు పుట్టు
నామహాత్ముభజన యనువు మీఱ
నియమనిష్ఠ నెఱపి నెమ్మది గనవలె
విశ్వదాభిరామ వినుర వేమ. 3.20
ప్రపఞ్చో జాయతే యస్మాత్ భక్త్యా తం
ప్రణమన్ సదా ।
నియతో
నిష్ఠయోపేతో విద్వాన్ సమశ్నుతే ॥
ఒదిగి యొదిగి గురువు నొప్పుగా నొప్పించి
మదిని నిల్పి జాతిమమత విడిచి
కదియుచుండు నతఁడు కలకాల మొకరీతి
విశ్వదాభిరామ వినుర వేమ. 3.21
గురుం ప్రణమ్య తం కృత్వా ప్రసన్నం, ప్రాప్య
శేముషీమ్ ।
జాత్యహఙ్కారరహితః
స సదా భువి రాజతే ॥
ఔచితిం గన్నవాఁ డెపు డర్హమైన
గౌరవమ్మును పదవిని గనుచు నుండు
సర్వజనులును బూజింప సంతసమును
దండి దౌ కీర్తినార్జించుచుండు
వేమ. 3.22
పణ్డితో దేశకాలజ్ఞః
స్థానగౌరవమశ్నుతే |
స సదా పూజితః
సర్వైః స్థిరాం కీర్తిం చ విన్దతే ॥
కడఁగి సంకల్పముల నెల్ల కట్టి పెట్టి
చిత్తమున నేమి తలఁపక చిత్రరూపు
కైవడిని నుండు నాతడు ఘనుఁడు దలఁప
విశ్వదాభిరామ వినుర వేమ. 3.23
ఆశాః సర్వాః పరిత్యజ్య చిత్తం
కార్యాన్నివర్తయన్ ।
చిత్రార్పిత ఇవ
స్తబ్ధః యో భవేత్స వరో మతః ॥
కనఁగ సొమ్ము లెన్నొ! కనకం బదొక్కటె
పసులవన్నె లెన్నొ! పాలొకటియె
పుష్పజాతులెన్నొ! పూజయొక్కటె సుమీ
విశ్వదాభిరామ వినుర వేమ. 3.24
భూషాసు స్వర్ణమేకం స్యాత్
క్షీరమేకం పశుష్వపి ।
పూజార్హత్వం చ
పుష్పేషు జ్ఞానమేకం బుధేష్వపి ॥
కప్పురంపు మనసు గాంక్షించు యోగికి
జ్ఞానదీపశిఖయుఁ దా నటించుఁ
గానవచ్చు నాత్మక్రమమాణ మైయుండు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.25
వాసనావాసితే చిత్తే జ్ఞానదీపే
జ్వలత్యపి ।
క్రమేణాత్మస్వరూపం
తు జానీతే యోగిసత్తమః ॥
కల్ల గురుఁడు గట్టు కర్మచయంబులు
మధ్యగురుఁడు గట్టు మంత్రచయము
ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యంబు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.26
మూర్ఖో గురుః కర్మయోగం జనానాం
తారకం వదేత్ ।
మధ్యమో
మన్త్రమాహాత్మ్యముత్తమో యోగసాధనమ్ ॥
కలుషమానసులకు గాన్పింపఁ గా రాదు
అడుసులోన భానుఁ డడంగినట్లు
తేటనీరు పుణ్యదేహ మట్లుండురా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.27
జ్ఞానం భాత్యమలే చిత్తే న వై
కలుషమానసే |
యథా రవిః
శుద్ధజలే న తథా పఙ్కిలే జలే ॥
కస్తూరి యటుచూడఁ గాంతి నల్లగ నుండు
పరిమళించు దాని పరిమళంబు
గురువులైనవారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.28
కస్తూరీ నీలరూపైవ గన్ధస్తస్య మహాన్
భువి |
ఆకృత్యా గురవః
శాన్తాః గుణైః ఖ్యాతాశ్చ తే భువి ॥
కాకిగూటిలోన కోకిల మనినట్లు
భ్రమర మగుచుఁ బురువు బ్రతికినట్లు
గురువులౌదు రిలను గుణులిట్లు వర్తింత్రు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.29
పికః కాకేన వసతి కీటోఽపి భ్రమరాయతే ।
మూర్ఖోఽపి సాధుసంసర్గాత్ గుణవాన్ జాయతే గురుః ॥
కుండ కుంభ మన్న గొండ పర్వత మన్న
నుప్పు లవణ మన్న నొకటి గాదె
భాషలిట్లె వేరు పరతత్త్వ మొక్కటే
విశ్వదాభిరామ వినుర వేమ. 3.30
నగాచలౌ కుంభఘటౌ తథా లవణసైన్ధవౌ ।
అత్ర భేదః పదే
నార్థే తుల్యమేతత్ హరావపి ॥
గాలి లేనిదీపకళిక చందంబున
నలలు సుళ్లు లేనిజలధిరీతి
నిశ్చలాత్మ యెన్న నిర్వికారంబున
నుండెనేని పండితుండు
వేమ. 3.31
నివాతదీపశిఖయా నిస్తరఙ్గాబ్ధినా
సమః ।
నిశ్చలో
నిర్వికారశ్చ యో భవేత్ స హి పణ్డితః ॥
చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియుఁ గొదవకాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?
విశ్వదాభిరామ వినుర వేమ. 3.32
చిత్తశుద్ధ్యా కృతం పుణ్యం స్వల్పం
వాపి భవేన్మహత్ ।
వటబీజాత్ యథా
స్వల్పాత్ మహాన్ వృక్షః ప్రరోహతి ॥
చినుఁగు బట్టకాదు చీనాంబరము గాని
ముఱికి యొడలు కాని ముక్తి గాని
పరమయోగిమహిమ పరికింప రిట్టులు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.33
దివ్యం తు మలినం దేహం
క్షౌమవజ్జీర్ణమమ్బరమ్ ।
పశ్యతో
యోగివర్యస్య శ్రైష్ఠ్యం నో వేత్తి మానవః ॥
చెఱుకుతోఁటలోనఁ జెత్తకుప్పుండిన
గొంచెమైన దాని గుణము చెడదు
యెఱుకఁ గలుగుచోట నెడ్డెవాఁడున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.34
ఇక్షుక్షేత్రస్య మాలిన్యాత్
మాధుర్యం నాస్య హీయతే ।
న మూర్ఖజనసమ్పర్కాత్
హీయతే జ్ఞానినం గుణః ॥
చదువరిమతికన్న సాధకుమతి మేలు
వేదములను లేదు వాదములను
ఒడలుశుద్ధిఁ జేసి యొడయునిఁ జూచెడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.35
నిఃసారవిద్యావేదిభ్యః సాధకః
శ్రేష్ఠ ఇష్యతే ।
వేదే వాదః కుతో, దేహశుద్ధ్యా
తత్ర హరిం భజ ॥
చూపుల చూపై తోఁచెడి
రూపములకు రూప మదియె రూపము గాకే
దాపై లోపల విలుపలఁ
గాపగు పరిపూర్ణమూర్తికనవలె
వేమా.[1] 3.36
రూపస్య రూపం దృష్టేశ్చ
దృష్టిమన్తర్బహిర్గతమ్ ।
అరూపం
జ్ఞానరూపం చ పూర్ణం చిత్తే తు భావయేత్ ॥
జాతి నీతి వేఱు జన్మం బదొక్కటి
అరయ దిండ్లు వేఱె యౌనుగాక
దర్శనములు వేఱు దైవ మౌనొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ. 3.37
జన్మైకం జాతయో భిన్నాః; తూలమేకం
బహుష్వపి ।
ఉపధానేషు
తద్వత్ స్యాత్ , హరి రేకో మతం బహు ॥
జీవభేద మెఱిఁగి చెడిపోనివారలు
బ్రహ్మభావమొంది పరగుచుంద్రు
నీరుముత్యమై నీరుగా మారునా?
విశ్వదాభిరామ వినుర వేమ. 3.38
జీవభేదపరిజ్ఞానాత్ బ్రహ్మభావం గతః
పునః ।
న జీవః స్యాత్, జలాజ్జాతం
మౌక్తికం న భవేత్ జలమ్ ॥
జీవియందు భ్రమలు చేరియుండుట కద్దు
జీవభ్రమలయందె జిక్కఁ డెపుడు
జీవి జీవియైన జిన్మాత్రమగుబయల్
విశ్వదాభిరామ వినుర వేమ. 3.39
యుక్తో జీవే భ్రమో జీవో భ్రమవశ్యో
న జాయతే ।
జీవో
జీవత్వవిజ్ఞానాత్ చిన్మాత్రం జాయతే తతః ॥
తత్త్వవాదు లుంద్రు ధర నెందరైనను
తత్త్వవేదిఁ జూడ ధరణి లేఁడు
గలిగెనేని వాఁడు కానంగఁ బడఁడయా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.40
బహవస్తత్త్వవక్తారః తత్త్వజ్ఞో
నాస్తి కశ్చన ।
యది
కశ్చిద్భవేత్ సోఽయం కథం స్యాఢ్ దృష్టిగోచరః ॥
తనువులోన వెదకి దైవంబు మొనఁ జేసి
ముందు కర్మములను మూలఁ ద్రోసి
మనసు నిజముఁ జేసి మమతలన్నియు రోయు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.41
స్వదేహే హరిమన్విష్య త్యక్త్వా
కర్మాణి పణ్డితః ।
మనో నిగృహ్య
మమతాబన్ధనాన్ముచ్యతే సదా ॥
తనువులోని యాత్మతత్త్వ మెరుంగక
వేఱే కలఁ డటంచు వెదుకఁ డెపుడు
భానుఁ డుండ దివ్వె పట్టుచు వెదుకునా?
విశ్వదాభిరామ వినుర వేమ. 3.42
హరౌ స్వాత్మగతే ప్రాజ్ఞో
నాన్విచ్ఛతి పరత్ర తమ్ |
భాసమానే రవౌ కో
వా దీపమాదాయ మార్గయేత్ ॥
తన్నెఱుఁగనివాడు తానె తానై యుండుఁ
దన్నెఱిఁగినవాఁడుఁ దానె తాను
దనువు లేనివాఁడు తానె తానౌ సుమ్మి
విశ్వదాభిరామ వినుర వేమ. 3.43
అనాత్మజ్ఞో భవేదజ్ఞోహ్యాత్మజ్ఞో
మూర్తిమాన్ హరిః |
విదేహదేవతారూపః
నిర్గుణబ్రహ్మతాం వ్రజేత్ ॥
తప్పు నొప్పు దెలిసి దైవసంకీర్తనల్
సేయువారు హరికి సేవకాళి
నీ తెఱుఁగక వారి నిందింపఁబోవరు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.44
గుణాగుణజ్ఞో యో దేవం కీర్తయేత్ స
తు భక్తిమాన్ ।
నీతిసారమిమం
జ్ఞాత్వా గర్హయేత్తం న పణ్డితః ॥
తరువఁ దరువఁ బుట్టు దరువునం దనలంబు
దరువఁ దరువఁ బుట్టు దధిఘృతంబు
తలపఁ దలపఁ బుట్టు తనువునఁ దత్త్వంబు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.45
వహ్నిః స్యాత్ కాష్ఠమథనాత్ ఘృతం
స్యాత్ దధిమన్థనాత్ ।
అసకృచ్చిన్తనాత్
చిత్తే తత్త్వముత్పద్యతే కిల ॥
తాను నే ననియెడు తత్త్వభేదంబును
మాని యలవివేకమహిమఁ దనరి
యూఱకుండు జ్ఞాని యుత్తమోత్తముఁడగు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.46
ఐక్యం జీవేశయోః జ్ఞాత్వా వివేకేన
సమన్వితః
పణ్డితో
మౌనమాస్థాయ లోకే స్యాదుత్తమోత్తమః ॥
తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక
యట్టునిట్టుఁ జూచి యదరిపడక
తన్నుఁ గాని యట్లు తత్త్వజ్ఞుఁడుండును
విశ్వదాభిరామ వినుర వేమ. 3.47
స్వనిన్దకం ఘాతకం చ సోఢ్వా సర్వత్ర
నిర్భయః ।
సమ్బద్ధో
నాహమత్రేతి జ్ఞానీ సర్వసమో భవేత్ ॥
వెఱ్ఱివాని మిగుల విసిగింపఁగారాదు[2]
వెఱ్ఱివాని మాట వినఁగరాదు
వెఱ్ఱికుక్కఁ బట్టి వేఁటాడఁగారాదు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.48
మూర్ఖం న కోపయేత్ ప్రాజ్ఞః న
శ్రోతవ్యం చ తద్వచః ।
ఉన్మత్తశునకం
ప్రాప్య మృగయాం కః సమాచరేత్ ॥
దేవపూజసేయ[3] దివ్యభోగము గల్గు
తత్త్వమెఱుఁగఁగలడు దైవసముఁడు
యేమి లేని నరుని కేగతి లేదురా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.49
దేవపూజపరో విద్వాన్ భోగవాన్
తత్త్వదర్శనః ।
దేవతుల్యో
భవేల్లోకే వ్యర్థం మూర్ఖంస్య జీవితమ్ ॥
దేహగుణములెల్లఁ దెలిసిన శివయోగి
మోహమందు దవిలి[4] మోసపోఁడు
ఇంద్రజాలకుం డటెందును జిక్కఁడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.50
యోగీ కాయస్వభావజ్ఞః వఞ్చితో న
భవేత్పరైః ।
యథైన్ద్రజాలికో
మాయావస్తు దృష్ట్వా న ముహ్యతి ॥
ధ్యానివలెనె యుండు మౌనివలెనె యుండు
భోగివలెనె యుండు రోగివలెనె
సకలమును దెలిస సర్వజ్ఞుఁడై యుండు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.51
కదాచిత్ యోగినా తుల్యః, మౌనినా భోగినా
సమః ।
రోగితుల్యో
భవేద్విద్వాన్ సర్వజ్ఞ ఇవ చ క్వచిత్ ॥
నందుఁడగుచు జ్ఞాని యిందు నందనకుండు
నన్ని తావులందు హరునివలెనె
తెలియువారికెల్ల దేవుఁడై కాన్పించు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.52
విష్ణుతుల్యో జగద్వ్యాపీ జ్ఞానీ
మోహపాగతః ।
స్వాశ్రితానాం
మహత్సాహ్యం కుర్వన్నీశ్వర ఏవ సః ॥
పగలు రేయి మఱచి భావంబు మఱచియు
తాను నే ననియెడి తలఁపు మఱచి
యుండువాని నెంచ యుత్తమయోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.53
దివానిశానభిజ్ఞస్తు
సర్వభావవివర్జితః |
నిర్మమో
భేదశూన్యో యో వర్తతే స తు యోగిరాట్ ॥
పట్టు పట్టబోఁడు పట్టినవిడఁబోఁడు
నెట్టిగుణవికారనిహతి నడఁచి
మిట్టిపడక లోన మిన్నందు విజ్ఞుఁడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.54
బుధః కార్యం న గృహ్ణాతి గృహీతం
నాపి ముఞ్చతి ।
నిస్తమో
నిరహఙ్కారః ప్రాప్నోతి స్థానముత్తమమ్ ॥
పరఁగినగాలి నభంబున
నెఱయంగా భూమియందు నీరుండిగదా
దరిదాపుల వేఱొక్కటి
యిరవుకొనుం దేజ మిట్లె
యెల్లెడ వేమా! 3.55
వాయుర్వ్యోమ్ని జలం భూమ్యామితి
స్థానక్రమో యథా ।
పణ్డితేషు తథా
జ్ఞానం న మూర్ఖే స్థానభేదతః ॥
పరుస మినుముసోఁక బంగారమైనట్లు
కప్పురంబుఁ జ్యోతిఁ గలసినట్లు
పుష్పమందుఁ దావి పొసఁగినట్లగు ముక్తి
విశ్వదాభిరామ వినుర వేమ. 3.56
కర్పూరం లీయతే వహ్నౌ అయః స్వర్ణం
భవేద్రసాత్ ।
సువాసనేవ
కుసుమే జ్ఞానినా ముక్తిభాగ్ జడః ॥
పాలలోనఁ బులుసు లీలతోఁ గలిసిన
విఱిసి తునుకలగును విరివిగాను
తెలియుమనములోన[5] దివ్యతత్త్వము
తేట
విశ్వదాభిరామ వినుర వేమ. 3.57
తిన్త్రిణీయోగతః క్షీరం శీర్ణమేతి
వికారతామ్ ।
చిత్తం
సదసతోర్యోగాత్ వికృతం జాయతే తథా ॥
పికము వనములోన పెల్లుగాఁ బలికిన
భంగి ప్రాజ్ఞజనుల పలుకు లుండు
కాకి కూఁతఁబోలు కర్మబంధులకూఁత
విశ్వదాభిరామ వినుర వేమ. 3.58
పూజ్యతే సాధువచనం దూరేఽపి పికశబ్దవత్ ।
గర్హ్యతే
మూర్ఖవచనమగ్రే కాకరవో యథా ॥
పుడమి దిరిగి బడయు పుణ్యంబు లెల్లను
గలుగు సాధుజనులఁ గన్నయపుడె
వడిని నీరు నదిని గడుఁ దేటయే యుండు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.59
సాధుదర్శనమాత్రేణ దేశాటనఫలం భవేత్ ।
వర్షతోయం నదీం
ప్రాప్య నిర్మలం జాయతే యథా ॥
పైరు నిడినవానిఫల మదే సఫలంబు
పైరు నిడనివాఁడు ఫలముఁ గనునె
పైరునిడినవాఁడు బహుసౌఖ్యవంతుఁడౌ
విశ్వదాభిరామ వినుర వేమ. 3.60
సస్యం వర్ధయతః సౌఖ్యం తదభావే కుతః
సుఖమ్ ।
యత్నేన లభ్యతే
జ్ఞానం నో చేన్మూర్ఖో భవేన్నరః ॥
ప్రజ లెఱుంగ బ్రదుకుఁ పట్టభద్రుఁడు గాఁడు
పైఁ గిరీట ముండు బ్రహ్మ గాఁడు
నోగుఁ దెలిసి పలుకు యోగీశ్వరుఁడువాఁడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.61
దమ్భజీవీ న రాజాసౌ న బ్రహ్మా
జ్ఞానవానపి ।
ఉపదిశ్య జనాన్
రక్షన్ బుధో యోగిసమః స్మృతః ॥
పృథివిమీఁదఁ బుట్టి ప్రిదులఁగ హంసల
విహరణం బెఱింగి విడువక మదిఁ
దిరుగ నేర్చియుండు ధీమంతుఁ డెప్పుడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.62
గృహీత్వా మానుషం జన్మ
పఞ్జీకరణపద్ధతిమ్ ।
జ్ఞాత్వాఽన్తర్గణయన్ చక్రం ముక్తిం ప్రాప్నోతి పణ్డితః ॥
బంటువలెనె లేవఁ బండితంమన్యుఁడు
సాధుపండితుండు శాంతుఁ డగును
కుక్క గూయ నేమి గుఱ్ఱమునకు లెక్క
విశ్వదాభిరామ వినుర వేమ. 3.63
ప్రశాన్తపణ్డితం మూర్ఖః సాటోపం
పరిగర్హతే ।
శునో
గుర్గురశబ్దేన న్యూనతా నాస్తి వాజినః ॥
బహుళ కావ్యములను బరికింపఁగా వచ్చు
బహుళశబ్దచయము పలుకవచ్చు
సహన మొక్కటబ్బ చాలకష్టంబురా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.64
సులభం కావ్యపఠనం సులభం బహుభాషణమ్ ।
క్షాన్తిసమ్పాదనం
లోకే దుర్లభం కిల దేహినామ్ ॥
బాపలన్న దొడ్డపరువునఁ జూడరు
కానిపనులు సేయ గడలుకొనరు
కులము లెక్క యేమి గుణమే ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.65
నిర్విద్యం బ్రాహ్మణం చాపి
విద్వాన్ లోకే న మానయేత్ ।
న
కుర్యాన్నిన్దితం కర్మ గుణో ముఖ్యో న వై కులమ్ ॥
బ్రాహ్మణులకు సకలభాగ్యంబులీవచ్చు
గౌరవింపవచ్చు కలయవచ్చు
జ్ఞాన మొసఁగి జనులఁ గడ తేర్చునట్లయిన
విశ్వదాభిరామ వినుర వేమ. 3.66
దీయతాం బ్రహ్మణాయాపి గౌరవం
సమ్పదాదికమ్ ।
యది
జ్ఞానోపదేశేన స భవేల్లోకతారకః ॥
భువి నరకులమునఁ బుట్టియు
భువినరకులములను బెరిగి భువినరకులము౯
నవిరళముగ ‘ఛీఛీ’ యని
శివకులమునఁ దిరుగునతఁడె
సిద్ధుఁడు వేమా. 3.67
నరలోకే నరకులే భూత్వా
వృద్ధిముపాగతః ।
విరక్తో యో
భవేత్ తత్ర శివభక్తః స పణ్డితః ॥
మఠములోన నున్న మతము లన్నియుఁ గోసి
ఘటములోన నున్న ఘనునిఁ దెలిసి
ఘనత నిల్పుచుండు ఘనతత్త్వయోగియౌ
విశ్వదాభిరామ వినుర వేమ. 3.68
నానామతనిరాసేన జ్ఞాత్వా చిత్తగతం
హరిమ్ ।
హృది తం ధారయన్
విద్వాన్ యోగీ స్యాత్ క్రమశో భువి ॥
మననవృత్తిలోని మహిమనెఱుంగుచు
మనసునందె పూజమహిమ గనుచు
మానకుండువాఁడె మర్మజ్ఞుఁ డగు యోగి
విశ్వదాభిరామ వినుర వేమ. 3.69
విజ్ఞాయ ధ్యానమాహాత్మ్యం జ్ఞాత్వా
చ హరిపూజనమ్ ।
తదేవ సర్వదా కుర్వన్
తత్త్వజ్ఞో జాయతే బుధః ॥
మనసు గుప్తపఱచి మాన్యుఁడై విబుధుఁడు
తఱచు పలుకకుంట ధర్మమండ్రు
తఱచుమాటచేత దత్త్వంబు జెడిపోవు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.70
మాన్యో విద్వాన్ గూఢచిత్తో మితభాషీ
భవేత్సదా ।
అసకృదభాషణాన్నౄణాం
తత్త్వజ్ఞానం వినశ్యతి ॥
మనసునిల్పినట్టి మాన్యులౌ విబుధులె
గరిమ మోక్షపథముఁ గన్న వారు
చెట్టుఁ బెట్టి ఫలముఁ జేకొనకుందురా?
విశ్వదాభిరామ వినుర వేమ. 3.71
బుధో మాన్యో మనో జిత్వా మోక్షం
యత్నేన సాధయేత్ ।
కో వా
తుష్యత్యలబ్ధ్వైవ ఫలం వర్ధితపాదపాత్ ॥
మరణకాలమందు మది నిల్పు సుజ్ఞాని
పరముఁ బ్రతిభ చేతఁ బట్టు విడక
వెనుకఁ గోర్కెలకును విలపించునజ్ఞాని
విశ్వదాభిరామ వినుర వేమ. 3.72
మృత్యుకాలే బుధశ్చిత్తం యత్నేన
స్థాపయేద్ హరౌ ।
గతం
విచిన్తయన్నజ్ఞో మృత్యుకాలేఽపి రోదితి ॥
మర్మవిదుఁడు గాని మర్మంబుఁ గనలేఁడు
కర్మజీవిగాని కానలేఁడు
నీరుచొరక లోఁతునిజములు తెలియునా?
విశ్వదాభిరామ వినుర వేమ. 3.73
సూక్ష్మజ్ఞో వేత్తి సూక్ష్మాణి
కర్మఠః కష్టజీవినమ్ ।
యథా జలప్రవేశేన
జ్ఞాయతే ఖల్వగాధతా ॥
మాటలాడవచ్చు మనసు దెల్పఁగ లేఁడు
తెలుపవచ్చుఁ దన్నుఁ దెలియలేఁడు
సురియఁ బట్టవచ్చు శూరుఁడు గాలేఁడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.74
వక్తి, నో వేత్తి, కురుతే, పణ్డితంమన్యతే
జడః ।
ఖడ్గహస్తో జడః
శూరమాత్మానం మన్యతే భువి ॥
మాలకన్నియలకు మంచిరూపం బున్న
ముట్టెనే త్రిశంకుపట్టి నాఁడు
కానిపనులు సేయ ఘను లాసపడుదురా?
విశ్వదాభిరామ వినుర వేమ. 3.75
అనిష్టం నైవ కుర్వన్తి భూతలే
జ్ఞానిసత్తమాః ।
హరిశ్చన్ద్రో న
జగ్రాహ రమ్యాం చణ్డాలకన్యకామ్ ॥
ముక్తిఁ గాన లేని మూర్ఖజనుల కెల్ల
బట్టబయలు చేసి పరమపదము
దారిఁ జూపుబుధుఁడు దైవంబుగాఁడొకో
విశ్వదాభిరామ వినుర వేమ. 3.76
అజ్ఞాతమోక్షమార్గాణాం మూర్ఖాణాం
స్పష్టమేవ హి ।
దర్శకో
మోక్షమార్గస్య జ్ఞానీ దైవసమో మతః ॥
మున్ను నిన్ను గన్న ముఖ్యులెవ్వరొ వారి
సన్నుతించి పిదప సంతతమును
జ్ఞానదాతఁగొల్వు ఘనతచే విబుధుని
విశ్వదాభిరామ వినుర వేమ. 3.77
జనకౌ పితరౌ మాన్యౌ పూజయిత్వా తతో
గురుమ్ ।
జ్ఞానప్రదం
సమభ్యర్చ్య విద్వాన్ శ్లాఘ్యతమో భవేత్ ॥
మెలఁగి జ్ఞానమయుఁడు మితిమీఱుచుండఁడు
ఉనికి విడఁడు తాను నుపమునొందు
తనువు మఱచి మించి తత్త్వజ్ఞుఁ డుండును
విశ్వదాభిరామ వినుర వేమ. 3.78
మర్యాదామనతిక్రమ్య స్వస్థానస్థః
ప్రసన్నధీః ।
దేశాభిమానరహితో
విద్వాన్ తత్త్వం సమశ్నుతే ॥
మొదటను మతము౯ వదలక
తుద నెవ్వరిమతము నైన దూషింపక తా
బదిలుఁడయి కోర్కెఁ గోరక
ముదమున చరియించు బుధుఁడె
ముఖ్యుడు వేమా. 3.79
న నిన్దేన్మతమన్యేషాం స్వమతం న
పరిత్యజేత్ ।
యో నిరాశః
స్వయం తుష్టః స పణ్డితవర స్మృతః ॥
యాత్రలందలిఫల మొంది యాగములను
సూత్రసమముగఁ జేసియు సూక్ష్మమొంది
పరమహంసను గీలించి ప్రబలుచుండు
పరము గోరెడు ప్రాజ్ఞుఁ
డిద్ధరను వేమ. 3.80
యాత్రాయజ్ఞౌ సఙ్గ్రహేణ కృత్వా
లబ్ధ్వా ఫలం తయోః ।
పరమం
ప్రాప్తుకామో యః గణ్యతే స బుధోత్తమః ॥
రాజవరుల కెపుడు రణరంగముల చింత
పరమమునుల కెల్లఁ బరముచింత
అల్పనరుల కెల్ల నతివలపై చింత
విశ్వదాభిరామ వినుర వేమ. 3.81
యుద్ధచిన్తా సదా రాజ్ఞః
ధ్యానచిన్తా సదా మునేః ।
స్త్రీచిన్తా
స్యాత్ సదాల్పానాం జ్ఞానచిన్తా మహాత్మనామ్ ॥
లోను బదిలపఱచి లోనివికారముల్
తలఁచి మెట్టువారు తెలియవారు
ఆకసమున వేడ్క నరయంగ నుందురు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.82
చిత్తస్యాన్తర్వికారాన్ యో
నిరున్ధ్యాన్న ప్రకాశయేత్ ।
స విద్వాన్, వ్యోమ్ని
శబ్దాఖ్యం బ్రహ్మ జ్ఞాత్వా చ మోదతే ॥
వలయు నన్న రాదు వద్దన్న బోదది
తాను జేసియున్న ధర్మ మనుచు
ఉల్లమందుఁ దలఁపఁ డుత్తమవిబుధుఁడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.83
లబ్ధవ్యం లభ్యతే నూనం గన్తవ్యం
గచ్ఛతి స్వయమ్ |
కర్మాయత్తం
సర్వమేవం యో జానాతి స పణ్డితః ॥
వాద మాడఁ డెపుడు వరుస నెవ్వరితోడ
జేర రాఁడు తాను జేటుఁ దేడు
జ్ఞానియగుచు బుధుఁడు ఘనతనొందగఁజూచు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.84
శుష్కవాదవిదూరః సన్
దుష్టస్నేహవివర్జితః ।
గౌరవార్థం సదా
యత్నం కరోతి జ్ఞానిసత్తమః ॥
వాద మాడఁ డెపుడు వరుస నెవ్వరితోడ
జేర రాఁడు తాను జేటుఁ దేడు
జ్ఞానియగుచు బుధుఁడు ఘనతనొందగఁజూచు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.85
తరేదబ్ధిం నౌకయా వా లోకజ్ఞానం లభేత
వా ।
కిన్తు
తత్త్వార్థవిజ్ఞానలాభః కష్టతరో మతః ॥
విద్య లేనివాఁడు విద్వాంసులకడ
నుండగానె పండితుండు గాఁడు
కొలని హంసలకడ కొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.86
పాణ్డిత్యం బుధసంసర్గాన్న భవేత్
కిన్తు విద్యయా ।
నూనం హంసేన
సహితో బకో నాప్నోతి హంసతామ్ ॥
విద్య లేక యున్న విత్తము లేకున్న
మూఢుఁడైనఁ దుదకు మూఁగయైన
నిష్టబంధుఁడైన గష్టమే గలుగును
విశ్వదాభిరామ వినుర వేమ. 3.87
ధనేన విద్యయా లోకే గౌరవం లభతే నరః |
తాభ్యాం విహీనో
దుఃఖీ స్యాదిష్టబన్ధుయుతోపి చ ॥
వినతి సేయును సద్గురు వేఁడుచుండు
మును భ్రమరకీటక న్యాయమున నుండు
వాని నెన్నంగఁదరమె యీవసుధలోన
సాధుసన్మార్గ మదె యగు
జగతి వేమ. 3.88
నత్వా గురుమథాభ్యర్చ్య యః స్యాద్
భ్రమరకీటవత్ ।
గురురేష
హ్యచిన్త్యాత్మా సన్మార్గః స తు కథ్యతే ॥
విప్రవరులయందు విబుధులయందును
నీతి నుంచువాఁడె నిర్మలుండు
భక్తిగలుగువాఁడె పరమార్థపరుఁడయా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.89
విప్రవర్యే బుధశ్రేష్ఠే వినీతో
నిర్మలో భవేత్ ।
శ్రద్ధాభక్తియుతస్తేషు
పరమార్థరతః కిల ॥
విశ్వమనఁగ నేమొ వివరించి చూచును
విశ్వమైదువిధులు వెలయఁ గనును
విశ్వము మదిలోన వెదకును విబుధుఁడు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.90
జగద్విమర్శనపరః తన్మత్వా
పాఞ్చభౌతికమ్ ।
జగద్రూపం హరిం
చిత్తే యః పశ్యతి స పణ్డితః ॥
విశ్వరూపము మదిలోన వెలయఁ జూచి
హ్రస్వ మమరఁగ బుద్ధిని నంది పట్టి
స్వస్వరూపము గనుచుండు సజ్జనుండు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.91
జగచ్చిత్తగతం జ్ఞాత్వా కృత్వా
తన్మననం సదా ।
తేన జ్ఞాత్వా
స్వస్వరూపం విద్వాన్ భువి విరాజతే ॥
వీరుఁడైన రాదు విబుధులగుణములు
చదువులంద రాదు సటల రాదు
జన్మపాకముననె సఫలమౌ నరులకు
విశ్వదాభిరామ వినుర వేమ. 3.92
న పణ్డితగుణః శౌర్యాత్ విద్యయా వా
భవేదిహ ।
కేవలం
పూర్వపుణ్యేన తం లబ్ధ్వా సఫలో భవేత్ ॥
వెదకి కాన లేరు వేదాంతవేద్యుండు
నుత్తముండె కాంచు నుర్విమీఁద
కలిగెనే నతనిని గానంగ లేరయా
విశ్వదాభిరామ వినుర వేమ. 3.93
వేదాన్తవేద్యం పరమమటిత్వా న హి
పశ్యతి ।
యది
కశ్చిద్విజానీయాత్ స కథం దృష్టగోచరః ॥
వేడుక మదిలోఁ జూడక
తోడగు నా యెఱుకమీఱి తొక్కుడుపడకా
జాడను మఱచినవాఁడే
వేడుకఁ బరతత్త్వమంది
వెలయును వేమా! 3.94
న పశ్యేత్తు హరిం మూఢః, చిన్తయా కిం
ప్రయోజనమ్ ।
త్వరాం వినా
నిశ్చలః సన్ బుధో వేత్తి హరేః పదమ్ ॥
వ్యాధి కలిగెనేని వైద్యునిచేతను
మందు దినక కాని మాన దెందుఁ
జెంత దీప మిడక చీకటి వాయునా?
విశ్వదాభిరామ వినుర వేమ. 3.95
శాస్త్రేణ స్వానుభూత్యా వా
విద్వాన్ విగతసంశయః ।
నిశ్చలం
దీపకలికాతుల్యం తత్త్వం ప్రపద్యతే ॥
--::--
No comments:
Post a Comment